ఆ హీరోయిన్‌కు అల్లు శిరీష్ స్పెష‌ల్‌ గిఫ్ట్‌..నెట్టింట్లో మ‌ళ్లీ ర‌చ్చ‌!

అల్లు శిరీష్‌..2013లో ఇండస్ర్టీలోకి ఇచ్చిన ఈయనపై ఇప్పటి వరకు ఎలాంటి రూమర్స్‌ లేవు. ఎందుకంటే.. ఈయ‌న ఎప్పుడూ తన సినిమాలు, పర్సనల్ పనులు అవీ కాదంటే ఫిట్‌నెస్ ఫోకస్‌తో బిజీగా ఉంటాడు. కానీ, గ‌త కొద్దిగా రోజులుగా హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్‌తో శిరీష్ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు చూస్తుంటే.. ఎవ‌రికైనా వీరి మ‌ధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ న‌డుస్తుంద‌న్న అనుమానం రాక‌మాన‌దు.

- Advertisement -

Anu Emmanuel is back to form!

షూటింగ్ లొకేషన్స్, పార్టీలు, వ్యానిటీ రూం, కాఫీ షాప్ ఇలా ఎక్కడపడితే అక్కడే ఈ ఇద్దరూ హల్చల్ చేస్తూ సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఇక తాజాగా అనుకు అల్లు శిరీష్ స్పెష‌ల్ గిఫ్ట్ పంపాడు. ప్రెట్టీ లిటిల్ సైకో అంటూ రాసి ఉన్న టీ షర్ట్‌ను అనుకు పంపారు.

ఈ విష‌యాన్ని తెలిపుతూ.. అది నేను కాంప్లిమెంట్‌గానే తీసుకుంటాను.. ఇలా నాకు సెట్ అయ్యే టీ షర్ట్‌ను ఇచ్చినందుకు థ్యాంక్స్ అంటూ రిప్లై ఇచ్చారు అను. దానిపై అల్లు శిరీష్ స్పందిస్తూ.. అలా అయితే మనిద్దరిలో కామన్ విషయాలెన్నో ఉన్నాయ్.. ఎనీవే యూ ఆర్ వెల్కమ్ మై ఫేవరేట్.. అంటూ డ్యాష్ పెట్టేశారు. దీంతో వీరిద్ద‌ర‌పై నెట్టింట్లో మ‌ళ్లీ ర‌చ్చ మొద‌లైంది. వీరు డేటింగ్‌లో ఉన్నార‌ని.. త్వ‌ర‌లోనే పెళ్లిపీట‌లెక్క‌బోతున్నార‌ని ప్ర‌చారం చేస్తున్నారు.

Share post:

Popular