ఓటీటీలోకి `ఉప్పెన‌`..విడుద‌ల తేదీ ప్ర‌క‌టించిన నెట్‌ఫ్లిక్స్‌!

మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ డ‌బ్యూ మూవీ `ఉప్పెన‌`. బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వం వ‌హంచిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటించ‌గా.. విజ‌య్ సేతుప‌తి కీల‌క పాత్ర పోషించాడు. ఫిబ్రవరి 12న విడుదలైన ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

బాక్సాఫీస్ వ‌ద్ద భారీ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వ‌స్తుందా అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. అయితే ఆ టైమ్ రానే వ‌చ్చింది. . ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో ఉప్పెన విడుద‌ల కానుంది.

తాజాగా విడుద‌ల తేదీని కూడా ప్ర‌క‌టించింది నెట్‌ఫ్లిక్స్‌. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14 నుంచి స్ట్రీమింగ్ చేయ‌నున్న‌ట్టు నెట్‌ఫ్లిక్స్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించింది. దీంతో మరోసారి ఈ సినిమాను మోబైల్స్‌లో చూడొచ్చ‌ని మెగా అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.