భార‌త్ ఘ‌న‌త‌.. ఐరాస కీల‌క క‌మిటీల్లో స‌భ్య‌త్వం..!

భార‌తదేశానికి అంత‌ర్జాతీయ స్థాయిలో ఖ్యాతి మ‌రింత‌గా పెరిగింది. అరుదైన అవ‌కాశాన్ని, గుర్తింపును పొందింది. ఐక్య‌రాజ్య స‌మితి (యూఎన్) లోని మూడు ముఖ్యమైన కమిటీల్లో సభ్యత్వాన్ని సాధించింది. ఆర్థిక, సామాజిక కమిటీల్లో సభ్యునిగా చేరిన భారత్‌.. మూడేండ్లుగా మహిళా సాధికారత కోసం లింగ సమానత్వం, మహిళల సాధికారత కోసం యూఎన్ ఎంటిటీ ఫర్ ఈక్వాలిటీలో భారత్ సభ్యత్వం పొందింది. ఈ సభ్యత్వం పదవీకాలం వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ప్రారంభమవుతుంది. ప్రపంచ ఆహార కార్యక్రమంలో భారతదేశాన్ని ఇప్పటికే ఎగ్జిక్యూటివ్ బోర్డులో చేర్చ‌గా, ఇందులో ఫ్రాన్స్, ఘనా, కొరియా, రష్యా, స్వీడన్ దేశాలు కూడా ఉన్నాయి.

అదేవిధంగా క్రైం ప్రివెన్షన్ అండ్ క్రిమినల్ కమిషన్‌లో 2022 జనవరి 1 నుంచి మూడేండ్ల కాలానికి భారత్ ఎన్నికైంది. అదే సమయంలో, ఆస్ట్రియా, బహ్రెయిన్, బెలారస్, బల్గేరియా, కెనడా, ఫ్రాన్స్, ఘనా, లిబియా, పాకిస్తాన్, ఖతర్, థాయిలాండ్, టోగో, అమెరికా కూడా మౌఖిక ఆమోదంతో ఎన్నుకోగా.. బ్రెజిల్, డొమినికన్ రిపబ్లిక్, ప్రేగ్, చిలీ, క్యూబా రహస్య ఓటు ద్వారా ఎంపికయ్యాయి. ఇదిలా ఉండ‌గా భార‌త్ కు ఇప్ప‌టికే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో మూడు ముఖ్యమైన కమిటీలలో సభ్య‌త్వ‌మున్న‌ది. వాటిలో తాలిబాన్ సెక్షన్ కమిటీ, లిబియా సెక్షన్ కమిటీ, ఉగ్రవాద నిరోధక కమిటీలో చోటు ఉంది. ఈ ఏడాది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యుడిగా భారత్ ఎనిమిదోసారి తన సభ్యత్వాన్ని ప్రారంభించ‌డం గ‌మ‌నార్హం.