ప్ర‌భాస్ గురించి ఒక్క ముక్క‌లో చెప్పేసిన నటి..!

ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ చిత్రం షూటింగ్ 30 శాతం పూర్తయింది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. మొన్నటి వరకు నాన్ స్టాప్ గా జరిగిన షూటింగ్ కు ఇప్పుడు కరోనా కారణంగా బ్రేకులు పడ్డాయి. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న శృతి హాసన్ తన వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ గురించి అభిమానులతో చెప్పుకొచ్చింది.

మరి ముఖ్యంగా ప్రభాస్ గురించి కూడా చెప్పుకొచ్చింది శృతి. ప్రభాస్ చాలా మంచివాడని, తాను అసలు అంత సింపుల్ గా ఉంటాడని అస్సలు అనుకోలేదని చెప్పుకొచ్చింది. తను ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రభాస్స్ స్వీట్ హార్ట్ అని చెప్పింది శృతి హాసన్. తన కెరీర్ లో ప్రభాస్ లాంటి డార్లింగ్ ను చూడలేదని, మూవీ షూటింగ్ లో కూడా తాను ఒక స్టార్ హీరో అనే సంగతి పూర్తిగా మరిచిపోతాడని చెప్పింది శృతి హాసన్.