చ‌ర‌ణ్ సినిమాకు శంక‌ర్‌కు క‌ళ్లు చెదిరే రెమ్యున‌రేష‌న్ ?

ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్` చిత్రంలో చేస్తున్న మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని సెన్సేషనల్ దర్శకుడు శంకర్‌తో ఓ పాన్ ఇండియా చిత్రం చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే.

శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్నారు. పొలిటికల్‌ డ్రామాగా ఈ చిత్రం తెర‌కెక్క‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండే.. శంకర్ రెమ్యునరేషన్ కు సంబంధించి ఓ వార్త ప్ర‌స్తుతం నెట్టింట్లో వైర‌ల్‌గా మారింది.

కరెక్ట్ ఫిగర్ ఏమో కాని ఈ చిత్రానికి మాత్రం శంకర్ తన గత చిత్రాల్లో దేనికీ తీసుకోని స్థాయి రెమ్యునరేషన్ తీసుకుంటున్న‌ట్టు టాక్ న‌డుస్తోంది. మ‌రోవైపు రామ్ చ‌ర‌న్ కూడా భారీగానే రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది.