రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఎప్పుడూ ఏదో ఒక విషయంపై వివాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు వార్మ. అయితే తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, అక్కినేని అఖిల్ ను ఉద్దేశిస్తూ వర్మ షాకింగ్ కామెంట్ చేశాడు.
ఒక ఈవెంట్‌లో ఎన్టీఆర్, అఖిల్ కలిసి సరదగా ముచ్చటించుకుంటున్న వీడియోని షేర్ చేసిన వర్మ ఇక హీరోయిన్ల భవిష్యత్తు కష్టల్లో పడినట్లే.. అంటూ ఇండైరెక్ట్‌గా కామెంట్ పెట్టాడు.
ఎన్టీఆర్ సరదాగా అఖిల్ తొడపై సవరిస్తూ ఉంటే.. అఖిల్ తోసేస్తూ ఉండటం ఈ వీడియోలో ఉంటుంది. కానీ, వర్మ ఈ వీడియోపై వ్యాగంగా కామెంట్ చేయడంతో.. అటు నందమూరి అభిమానులు, ఇటు అక్కినేని అభిమానులతో పాటు నెటిజన్లు సైతం వర్మను విమర్శలతో ఏకిపారేస్తున్నారు. దీంతోప్రస్తుతం వర్మ ట్వీట్ వైరల్‌గా మారింది.
Am feeling so sad for heroines😢😢😢😫😫😫 pic.twitter.com/cK64qdQi4n
— Ram Gopal Varma (@RGVzoomin) April 8, 2021