బుల్లెట్‌పై ఎన్టీఆర్ హీరోయిన్ షికార్లు..వీడియో వైర‌ల్‌!

మ‌మ‌తా మోహ‌న్ దాస్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ హీరోగా తెర‌కెక్కిన య‌మ‌దొంగ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ మ‌మ‌తా.. చేసింది త‌క్కువ సినిమాలే అయిన‌ప్ప‌టికీ త‌న‌కంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

తెలుగులోనే కాకుండా మ‌ల‌యాళం, త‌మిళ భాష‌ల్లో కూడా న‌టించిన మ‌మ‌తా.. అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా సినిమాల‌కు దూర‌మైంది. అయితే దాదాపు 12 ఏళ్ల త‌ర్వాత లాల్‌బాగ్ అనే చిత్రంతో మ‌ళ్లీ రీఎంట్రీ ఇవ్వబోతోంది ఈ బ్యూటీ. ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళంలో ఒకేసారి విడుద‌ల కానుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా మ‌మ‌తా బుల్లెట్‌పై షికార్లు కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి.. ప‌దిహేను ఏళ్ల త‌ర్వాత బైక్ న‌డుపుతున్నాన‌ని కామెంట్ పెట్టింది. ఇక ఈ వీడియోలో మ‌మ‌తా సూప‌ర్ హాట్‌గా మ‌రియు స్టైలిష్‌గా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైర‌ల్‌గా మారింది.

https://www.instagram.com/p/CONvJxphq7w/?utm_source=ig_web_copy_link

Share post:

Popular