అందాల పోటీలలో కోళ్ల…. ఎక్కడంటే?

మాములుగా మనం కోళ్ల పందాలు గురించి వినే ఉంటాము. కానీ కోళ్లకు అందాల పోటీలు అట. అవును మీరు విన్నది నిజమే. ఆ పోటీలో పాల్గొనేది వేరే రకం జాతి కోళ్లు. పర్లా జాతి కోడి పెట్టలూ, పుంజులూ ప్రత్యేకంగా ఉంటాయి. ఈ కోళ్ల అందచందాలే వీటి ధరను నిర్ణయించి ఈ పోటీలో విజేతగా నిలబెడతుంటాయి. ప్రకాశం జిల్లాలోని కంభంలో కృష్ణమాచారి ఈ కోళ్లను ప్రత్యేకంగా పెంచుతున్నారు. అందమయిన కోడిగా పేరున్న ఈ పర్లా కోళ్ల పెంపకానికి చాలా ప్రత్యేక పద్ధతులే ఉంటాయి. కోడి అందమైన ఆకృతి కోసం ప్రత్యేకమైన డైట్‌ ప్లాన్‌ కూడా ఉంటుందట.

ఈ కోడి గుడ్డు కూడా 1000 కి పైగా పలుకుతుంది. తమిళనాడు రాష్ట్రంలోని దిండుక్కల్‌, సేలం, మదురై, తిరుచ్చి, చెన్నై లాంటి చోట్ల ఈ ప్రత్యేకమైన కోళ్లల్ని పెంచే పెంపకందారులు ఆలిండియా అస్లీస్ అనే క్లబ్‌ని ఏర్పాటు చేసి, అక్కడ ఈ అందాల పోటీల్ని నిర్వహిస్తుంటారు. వచ్చిన వందలాది కోళ్లలో మొదటి బహుమతికి పదికోళ్లను, రెండో బహుమతికి 30 కోళ్లను ఎంపిక చేసి బహుమతులు ఇస్తారు.