నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్న బాలయ్య హోలీ సంబరాల ఫోటో..!

March 30, 2021 at 1:30 pm

టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. వేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటోన్న ఈ చిత్రం పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో రెండు విభిన్నమైన పాత్రల్లో బాలకృష్ణ నటించబోతున్నట్లు టాక్. ఈ చిత్రానికి సంబంధించిన సెట్లో హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు మూవీ టీం అంతా.

ఈ సంధర్భంగా బాలయ్య పిక్ ఒక్కటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. హోలీ సంధర్భంగా బాలయ్య, బోయపాటితో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొనగా, బేబీ దిశ్నా అనే పాప అందరికీ రంగులు పూసి అల్లరి చేయడం విపరీతంగా అందరిని ఆకట్టుకుంటోంది. బాలకృష్ణతో ఆ పాపా అల్లరి చేస్తూ, రంగులు అద్దుతూ దిగిన పిక్స్ ఇప్పుడు సోషల్వై మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలయ్య నెవర్ బిఫోర్ లుక్ లో కనిపించారు. ఆయన చాలా న్యాచురల్ లుక్‌లో కనిపిస్తూ, అందరిని ఆశ్చర్యపరిచారు.

నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్న బాలయ్య హోలీ సంబరాల ఫోటో..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts