‘ c/o సూర్య‌ ‘ ప్రీమియ‌ర్ షో టాక్‌… సినిమా ఎలా ఉందంటే

నక్షత్రం వంటి డిజాస్టర్ చిత్రం తరువాత యువ హీరో సందీప్ కిషన్ న‌టించిన సినిమా c/o సూర్య. వ‌రుస స‌క్సెస్‌ల‌తో టాలీవుడ్‌లో గోల్డెన్‌గ‌ర్ల్‌గా మారిన మెహ్రీన్ కౌర్ ఈ సినిమాలో సందీప్ కిష‌న్ స‌ర‌స‌న న‌టించింది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో తెర‌కెక్కిన ఈ సినిమాకు కోలీవుడ్ డైరెక్ట‌ర్ సుసీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ రోజు రిలీజ్ అవుతోన్న ఈ సినిమా ఇప్ప‌టికే ఓవ‌ర్సీస్‌లో ప్రీమియ‌ర్ షోలు కంప్లీట్ చేసుకుంది. ప్రీమియ‌ర్ షో టాక్ ప్ర‌కారం ఈ సినిమాకు ఎలాంటి టాక్ వ‌చ్చిందో ? ప్రీమియ‌ర్ షో రిపోర్ట్‌లో తెలుసుకుందాం.

c/o సూర్య సినిమాలో ఫ్యామిలీ, క్రైం, స‌స్పెన్స్ లాంటి అంశాలు మిక్స్ చేసి ద‌ర్శ‌కుడు సుసీంద్ర‌న్ క‌థ‌నం న‌డిపించాడు. సినిమా ఫ‌స్టాఫ్ మేజ‌ర్ హైలెట్‌. సూర్య పాత్ర‌లో సందీప్ కిష‌న్ జీవించేశాడు. సందీప్ క్యారెక్ట‌ర్‌ను సుసీంద్ర‌న్ బాగా డిజైన్ చేసుకున్నాడు. క్యారెక్ట‌రైజేష‌న్ చాలా నేచుర‌ల్‌గా ఉంది. ఫ‌స్టాఫ్‌లో గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో సినిమా అదిరిపోయింది. ఫ‌స్టాఫ్ చూసిన ప్రేక్ష‌కులు సెకండాఫ్‌పై మ‌రింత అంచ‌నాల‌తో ఉంటారు.

అయితే సెకండాఫ్‌లో ద‌ర్శ‌కుడు కాస్త త‌డ‌బాటుకు గుర‌య్యాడు. క్రైం నేప‌థ్యంలో స‌స్పెన్స్ మెయింటైన్ చేస్తూ సినిమాను ముందుకు న‌డిపించిన తీరు ఆక‌ట్టుకుంది. విల‌న్ గ్యాంగ్ వ‌ర్సెస్ సందీప్ కిష‌న్ మ‌ధ్య మైండ్‌గేమ్ సీన్లు గుడ్‌. అయితే సినిమాలో కొన్ని మైన‌స్‌లు కూడా ఉన్నాయి. క‌మ‌ర్షియ‌ల్ ట్రాక్ కోసం బ‌ల‌వంతంగా చొప్పించిన సాంగ్స్‌, కామెడీ వ‌ర్క్ అవుట్ అవ్వ‌లేదు. ఓవ‌రాల్‌గా క్రైం + ఫ్యామిలీ నేప‌థ్యంలో వ‌చ్చిన ఈ సినిమా డీసెంట్ మూవీ. సందీప్‌కిష‌న్ కెరీర్‌లో మంచి మూవీగా నిలుస్తుంది. అయితే బాక్సాఫీస్ వ‌ద్ద క‌మ‌ర్షియ‌ల్‌గా ఎలాంటి ఫ‌లితం ఇస్తుందో ? చూడాలి.