డ్ర‌గ్స్ దందాలో ఉన్న టాలీవుడ్ ప్ర‌ముఖులు వీళ్లే

టాలీవుడ్‌ను కుదిపేస్తోన్న డ్ర‌గ్స్ దందాపై సిట్ చ‌క‌చ‌కా క‌దులుతోంది. ఈ డ్ర‌గ్స్ ఉదంతంలో ప‌లువురు స్టార్ హీరోయిన్లు, హీరోలు, ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల‌తో పాటు క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుల పేర్లు కూడా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఈ కేసును విచారించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం టాలీవుడ్‌లో ప‌లువురికి నోటీసులు పంపిన‌ట్టు తెలుస్తోంది. ఇక నోటీసులు అందుకున్న వారు ఆరు రోజుల్లోగా ఎప్పుడైనా విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సి ఉంటుంద‌ని కూడా ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నార‌ట‌.

ఇక వీరి పేర్లు బ‌య‌ట పెట్టేందుకు ద‌ర్యాప్తు అధికారులు ఒప్పుకోవ‌డం లేదు. ఇక మీడియాలోను వీరి పేర్లు రాసేందుకు ఎవ్వ‌రూ సాహ‌సించ‌డం లేదు. ఇక నోటీసులు అందుకున్న వారిలో గ‌తంలో బాల‌నటుడిగా కెరీర్ స్టార్ట్ చేసి త‌ర్వాత హీరో అయ్యి ఒక‌టి రెండు హిట్ల‌తోనే చాప చుట్టేసి ప్ర‌స్తుతం సినిమాలు లేక ఖాళీగా ఉన్న ఓ న‌టుడు ఈ దందాలో కీ రోల్ పోషిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

అలాగే ఓ ప్ర‌ముఖ గాయ‌కురాలి భ‌ర్త‌, ఒక‌టి రెండు సినిమాల్లో హీరోగా చేసిన ఓ వ్య‌క్తి పేరు కూడా విన‌ప‌డుతోంది. సినిమా ఫంక్ష‌న్లు జ‌రిగితే ఓ టాప్ హీరో ప‌దే ప‌దే త‌న దేవుడంటూ పొగిడేసే ఓ బ‌డా, బినామీ నిర్మాత (చాలా సినిమాల్లో చిన్నా చిత‌కా క్యారెక్ట‌ర్లు కూడా చేశాడు ) , అమెరికా నుంచి వ‌చ్చి కొన్ని హిట్ చిత్రాల్లో న‌టించి ఇప్పుడు అడ‌పా ద‌డ‌పా సినిమాల్లో న‌టిస్తోన్న మ‌రో హీరో, సినిమాలు స్పీడ్‌గా తీస్తాడ‌ని పేరున్న ఓ టాప్ డైరెక్ట‌ర్ (ఓ అగ్ర‌హీరోతో ప్ర‌స్తుతం సినిమా చేస్తున్నాడు) వీటికి బాగా బానిస‌ల‌య్యార‌ట‌.

ఇక ఈ రోజు నోటీసులు అందుకున్న ముగ్గురు హీరోయిన్ల‌లో గ‌తంలో స్టార్ హీరోల‌తో సినిమాలు చేసి, త‌ర్వాత ఐటెం సాంగ్‌లు చేసుకుంటూ, ముదురు ముద్దుగుమ్మ‌గా మారిన ఓ హీరోయిన్ (ఓ డైరెక్ట‌ర్‌తో స‌హ‌జీవ‌నం చేస్తోంద‌ని టాక్‌), వెండితెర‌పై, ఇటు టీవీ తెర‌పై రాణిస్తూ హాట్ హాట్ షోల‌తో అల‌రించే ఓ న‌టి, టాప్ హీరోల‌తో న‌టిస్తూ స్టార్ హీరోయిన్ స్టేట‌స్ ఎంజాయ్ చేస్తోన్న మ‌రో హీరోయిన్ సైతం ఉన్నార‌ని ఇండ‌స్ట్రీలోని ఇన్న‌ర్ సైడ్ టాక్‌.