జ‌గన్ సీఎం అయితే రోజా ఆ కీల‌క శాఖ‌కు మంత్రా..!

రోజాకు చంద్ర‌బాబు పొలిటిక‌ల్ లైఫ్ ఇచ్చినా ఆ పార్టీలో ఆమెకు ఏ మాత్రం క‌లిసి రాలేదు. చంద్ర‌బాబు రోజాను తెలుగు మహిళా అధ్య‌క్షురాలిగా చేసి ఆమె త‌న వాయిస్ వినిపించుకునే ఛాన్స్ ఇచ్చారు. ఈ ప‌ద‌వితో రోజా స్టేట్ వైడ్‌గా హైలెట్ అయ్యింది. త‌ర్వాత రోజాకు చంద్ర‌బాబు 2004, 2009లో రెండుసార్లు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చినా రెండుసార్లు ఆమె ఓడిపోయింది. 2004లో న‌గ‌రి సీటు ఇచ్చిన బాబు 2009లో అక్క‌డ గాలి ముద్దుకృష్ణ‌మ‌నాయుడు కోసం ఆమెను చంద్ర‌గిరికి పంపారు. అక్క‌డ కూడా రోజా ఓడిపోయింది.

ఆ త‌ర్వాత చంద్ర‌బాబుతో విబేధించిన ఆమె గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలో చేరి న‌గ‌రి నుంచి పోటీ చేసి ఏకంగా ముద్దుకృష్ణ‌మ‌నాయుడినే ఓడించి రికార్డు సృష్టించారు. అసెంబ్లీలోకి అడుగు పెట్టాల‌న్న త‌న కోరిక ఎట్ట‌కేల‌కు నెర‌వేర్చుకున్నారు. అప్ప‌టి నుంచి రోజా టీడీపీ అన్నా, చంద్ర‌బాబు అన్నా ఓ రేంజ్‌లో విరుచుకుప‌డిపోతున్నారు. అసెంబ్లీ సాక్షిగానే చంద్ర‌బాబును కామ సీఎం బాబు అంటూ తీవ్ర అస‌భ్య ప‌ద‌జాలం వాడారు. ఆ త‌ర్వాత ఆమె అసెంబ్లీ నుంచి యేడాది పాటు స‌స్పెన్ష‌న్‌కు సైతం గుర‌య్యారు.

చంద్రబాబును, టీడీపీని తిట్ట‌డంలో ఫ‌స్ట్ ర్యాంకు రోజాకే ఇచ్చేయొచ్చు. ఇక తాజాగా జ‌రిగిన వైసీపీ ప్లీన‌రిలోను ఆమె మ‌రోసారి చంద్ర‌బాబు, టీడీపీపై తీవ్ర‌స్థాయిలో దుమ్మెత్తిపోశారు. జ‌గ‌న్ రోజాను చంద్ర‌బాబును తిట్టేందుకు ఎలా వాడుకుంటున్నారో ? ప్లీన‌రీలో ఉమ్మారెడ్డి చెప్పిన మాట అంద‌రూ విన్నారు. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ గెలిచి జ‌గ‌న్ సీఎం అయితే రోజాకు కీల‌క‌మైన మంత్రిత్వ శాఖ ద‌క్కుతుంద‌న్న ప్ర‌చారం వైసీపీ వ‌ర్గాల్లో పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు వ‌స్తోంది.

గ‌తంలో దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి రెండోసారి గెలిచి సీఎం అయిన‌ప్పుడు స‌బితా ఇంద్రారెడ్డికి హోం మంత్రి ఇచ్చారు. ఇప్పుడు జ‌గ‌న్ సైతం పార్టీ త‌ర‌పున బ‌లంగా వాయిస్ వినిపిస్తోన్న రోజాకు ఈ కీల‌క శాఖ ఇస్తార‌ని వైసీపీ వ‌ర్గాలు త‌మ అంత‌ర్గ‌త సంభాష‌ణ‌ల్లో చ‌ర్చించుకుంటున్నాయి. అయితే ఇక్క‌డే మ‌రో సందేహం కూడా త‌లెత్తుతోంది. జ‌గ‌న్ రెడ్డి, ఆయ‌న సీఎంగా అయితే ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో హోం మంత్రి కూడా రెడ్డికే ఎలా ఇస్తార‌న్న ప్ర‌శ్న‌లు కొంద‌రు వేస్తున్నారు.

ఇక కాంట్ర‌వ‌ర్సీ ఉమెన్ అయిన రోజాకు జ‌గ‌న్ ఇంత కీల‌క శాఖ క‌ట్ట‌బెట్టే సాహ‌సం చేస్తారా ? అన్న‌ది కూడా మరో డౌట్‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ గెల‌వాలి…. రోజా న‌గ‌రిలో గెల‌వాలి ? అప్పుడు క‌దా ? జ‌గ‌న్ ఆమెకు హోం మినిస్ట‌ర్ ఇస్తారో ? లేదో ? తేలేది.