నాని ” నిన్ను కోరి ” ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌

నేచుర‌ల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ సినిమా నిన్ను కోరి ఈ శుక్ర‌వారం థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. నాని ఇప్ప‌టికే వ‌రుస‌గా ఆరు హిట్లు మీద జోరుతో ఉండ‌డంతో నిన్ను కోరిపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టే నిన్ను కోరికి తొలి రోజు ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తొలి రోజు నిన్ను కోరి 10కోట్లకు పైగా గ్రాస్.. 6 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఏరియా వైజ్‌గా నిన్ను కోరి ఫ‌స్ట్ డే వ‌సూళ్లు ఇలా ఉన్నాయి.

నైజాం – 1.69 కోట్లు

వైజాగ్ – 57 లక్షలు

ఈస్ట్ – 45 లక్షలు

వెస్ట్ – 32 లక్షలు

కృష్ణా – 36 లక్షలు

గుంటూరు – 40 లక్షలు

నెల్లూరు – 18 లక్షలు

యూఎస్ – 1.12 కోట్లు

——————————-

టోట‌ల్ = 10.6 కోట్ల గ్రాస్‌

షేర్ = 6.2 కోట్లు