రాజ‌మౌళి కోసం ఎన్టీఆర్ భారీ రిస్క్‌

బాహుబ‌లి 2 రికార్డులు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఆ సినిమా డైరెక్ట‌ర్‌, ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చే నెక్ట్స్ సినిమా ఏదా ? అని దేశ‌వ్యాప్తంగా ఉన్న మూవీ ల‌వ‌ర్స్ ఎంతో ఉత్సుక‌త‌తో వెయిట్ చేస్తున్నారు. రాజ‌మౌళి డైరెక్ష‌న్‌లో న‌టించేందుకు ఆస‌క్తి చూప‌ని హీరో అంటూ ఎవ్వ‌రూ ఉండ‌రేమో..!

ఈ క్ర‌మంలోనే టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ త‌న నెక్ట్స్ మూవీని రాజ‌మౌళితోనే చేసేందుకు గ‌ట్టి ప్ర‌య‌త్నాలే చేస్తున్న‌ట్టు ఇండ‌స్ట్రీలో టాక్ న‌డుస్తోంది. బాహుబ‌లి 2 త‌ర్వాత రాజ‌మౌళి క్రేజ్ దేశ‌వ్యాప్తంగా మార్మోగుతున్నా రాజ‌మౌళి మాత్రం త‌న నెక్ట్స్ సినిమా టాలీవుడ్ హీరోల‌తోనే ఉంటుంద‌ని చెప్పేశారు. నిర్మాత‌లు దాన‌య్య‌, కెఎల్‌.నారాయ‌ణ‌ల‌లో ఎవ‌రో ఒక‌రితో త‌న నెక్ట్స్ సినిమా ఉండొచ్చ‌ని కూడా ఆయ‌న హింట్ ఇచ్చారు.

ఈ క్ర‌మంలోనే ఎన్టీఆర్ రాజ‌మౌళిని మిస్ చేసుకోకూడ‌ద‌ని డిసైడ్ అయ్యాడ‌ట‌. ఇప్ప‌టికే త‌న‌కు ‘స్టూడెంట్ నంబర్ వన్’, ‘సింహాద్రి’, ‘యమదొంగ’ వంటి హిట్స్ ఇచ్చిన రాజమౌళితో నాలుగోసారి సినిమా చేయాలని ఎన్టీఆర్ నిర్మాత‌ల సైడ్ నుంచి క‌థ న‌డుపుతున్నాడ‌ట‌. ఎన్టీఆర్ ఇప్ప‌టికే దాన‌య్య‌కు డేట్స్ ఇచ్చారు. ఈ క్ర‌మంలోనే రాజ‌మౌళితో సినిమా ఓకే అయితే ఆ సినిమా కోసం ముందుగా తాను ఒప్పుకున్న త్రివిక్ర‌మ్‌, కొర‌టాల శివ సినిమాల‌ను సైతం పెండింగ్‌లో పెట్టే సాహ‌సం చేస్తున్నాడ‌ట‌. మ‌రి ఎన్టీఆర్ రాజ‌మౌళితో సినిమా కోసం ఇంత పెద్ద రిస్క్ చేస్తున్నా, రాజ‌మౌళి ఈ ప్ర‌తిపాద‌న‌కు ఏం చెప్తాడా ? అన్న‌దే చూడాలి.