షాక్‌: బాహుబ‌లిని చంపింది క‌ట్ట‌ప్ప కాదు…ఎవ‌రో తెలిస్తే షాకే

టాలీవుడ్ ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్ఎస్‌.రాజ‌మౌళి తెర‌కెక్కించిన విజువ‌ల్ వండ‌ర్ బాహుబ‌లి సంచ‌ల‌నాల‌కే సంచ‌ల‌నాలు క్రియేట్ చేసింది. తెలుగులో మిన‌హా మిగిలిన సౌత్‌, నార్త్ భాష‌ల్లో ఎలాంటి సంచ‌ల‌నాలు లేకుండా రిలీజ్ అయిన బాహుబ‌లి ఏకంగా రూ.600 కోట్లు కొల్ల‌గొట్టింది. ఇప్పుడు బాహుబ‌లికి కొన‌సాగింపుగా వ‌స్తోన్న బాహుబ‌లి – ది క‌న్‌క్లూజ‌న్ సినిమాపై ఎలాంటి అంచ‌నాలు ఉన్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

తాజాగా రిలీజ్ అయిన బాహుబ‌లి – ది క‌న్‌క్లూజ‌న్ ట్రైల‌ర్ 20 గంట‌ల్లోపే రెండు కోట్ల వ్యూస్‌తో పాటు 5 ల‌క్ష‌ల లైక్స్‌తో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇదిలా ఉంటే ఇండియ‌న్ సినిమా జ‌నాలంద‌రూ బాహుబ‌లి – ది క‌న్‌క్లూజన్ సినిమాలో ఒక్క ప్ర‌శ్న‌కు ఆన్స‌ర్ కోసం ఎంతో ఉత్కంఠ‌తో వెయిట్ చేస్తున్నారు.

బాహుబ‌లికి అత్యంత విశ్వాస‌పాత్రుడైన క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు క‌త్తితో పొడిచాడ‌న్న ప్ర‌శ్న‌కు యే రేంజ్‌లో సెర్చింగ్ జ‌రుగుతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ప్ర‌ముఖ సెర్చింజ‌న్ దిగ్గ‌జం గూగుల్ లో కూడా వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అంటూ లక్షల మంది సెర్చ్ చేయడం విశేషం.

ఈ ఉత్కంఠ‌కు వ‌చ్చే నెల‌లో తెర‌ప‌డ‌నుంది. అయితే ఈ ప్ర‌శ్న‌కు ఆన్స‌ర్ గురించి ఓ షాకింగ్ న్యూస్ హ‌ల్ చ‌ల్ చేస్తోంది. బాహుబ‌లిని క‌ట్ట‌ప్ప చంప‌లేద‌ట‌. సినిమాలో ఈ స‌స్పెన్స్ రివీల్ అయ్యాక అంద‌రూ షాక్ అయిపోతార‌ట‌. మ‌రి బాహుబ‌లిని క‌ట్ట‌ప్ప చంప‌క‌పోతే ఎవ‌రు చంపారు ? ఈ ప్ర‌శ్న‌కు అని ఇప్పుడు మ‌రింత స‌స్పెన్స్ క్రియేట్ అయ్యింది. ఏదేమైనా బాహుబ‌లి 2 రిలీజ్ అయ్యే ఏప్రిల్ 28 వ‌ర‌కు ఈ స‌స్పెన్స్‌కు తెర‌ప‌డేలా లేదు.