రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ మహేష్ కోసమేనట!

రాజమౌళి మొన్నటివరకు టాలీవుడ్ లో ఈ పేరే ఒక బ్రాండ్. బాహుబలి తో రాజమౌళి అనే పేరు నేషనల్ లెవెల్ లో పెద్ద బ్రాండ్ అయిపోయింది. బాహుబలి తో తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచేసి, బాలీవుడ్ కే సొంతమయిన నేషనల్ ఫాలోయింగ్ ని  టాలీవుడ్ కి లాక్కోచ్చేసాడు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని ఇప్పుడు బాహుబలి 2 రిలీజ్ కోసం భారత దేశం మొత్తం ఎదురు చూసేంత క్రేజ్ సంపాదించుకున్నాడు ఈ టాలీవుడ్ జక్కన్న. ఇప్పుడు ఆ క్రేజ్ ని రెండింతలు చేసేట్టుగా వుంది బాహుబలి 2 ట్రైలర్ చూస్తుంటే.

బాహుబలి 2  ట్రయిలర్ చుసినతరువాత 1000  కోట్లని కొల్లగొట్టటం కాయం అంటున్నారు టాలీవుడ్ విశ్లేషకులు. అయితే ఇప్పడు అంత చర్చించుకునేది జక్కన్న నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించే. అయితే గత 5 , 6 సంవత్సరాలుగా బాహుబలి ప్రాజెక్ట్ తోనే జీవనం సాగించిన రాజమౌళి తన నెక్స్ట్ సినిమా గురించి ఎలాంటి క్లూ ఇవ్వటం లేదు. ఇప్పటివరకు బాహుబలి బరువును మోసిన జక్కన్న కొంతకాలం రెస్ట్ తీసుకోవాలనే ఆలోచనలో వున్నాడట.

అయితే తాను రెస్ట్ తీసుకునే సమయంలో తన అసిస్టెంట్స్ కి ఒక బాధ్యత అప్పచెప్పాడట అది తన నెక్స్ట్ సినిమాకి సంబంధించిన హీరో క్యారెక్టరీజషన్ గురించి. ఆ విషయం చాలా గోప్యంగా ఉంచాలని కూడా తన అసిస్టెంట్స్ కి సూచించాడట జక్కన్న.  అయితే ఆ క్యారెక్టరీజషన్ సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం డిజైన్ చేసిందేనని, రాజమౌళి, మహేష్ కాంబినేషన్లో సినిమా చేయాలనీ ఎప్పటినుంచో అనుకుంటున్నాం కానీ కుదరట్లేదు అని రాజమౌళి చాలాసార్లు స్టేజి పైనే చెప్పిన సందర్భాలు వున్నాయి. అయితే ఇప్పుడు ఆ కాంబినేషన్లో సినిమా చేసే ఆలోచనతోనే తన అసిస్టెంట్స్ కి ఈ ప్రాజెక్ట్ అప్పజెప్పాడనే టాక్ వినిపిస్తుంది టాలీవుడ్ లో.