బాహుబ‌లి 2 ట్రైల‌ర్ రివ్యూ…చూడాల్సింతే…చెప్పేది కాదు

ఇండియ‌న్ సినిమా జ‌నాలు ఎంతో ఉత్కంఠ‌తో వెయిట్ చేస్తోన్న బాహుబ‌లి 2 ట్రైల‌ర్ వ‌చ్చేసింది. 2.44 నిమిషాల నిడివి ఉన్న ట్రైల‌ర్‌లో క‌ళ్లు చెదిరిపోయే సెట్టింగులు, అదే రిచ్‌నెస్‌, అనుష్క అందాలు, ప్ర‌భాస్‌-అనుష్క మ‌ధ్య రొమాంటిక్ ల‌వ్‌స్టోరీ, త‌మ‌న్నా, అనుష్క క‌త్తి ఫైటింగ్‌లు, భ‌యంక‌ర‌మైన వార్ స‌న్నివేశాలు ట్రైల‌ర్‌ను క‌ళ్లుచెదిరిపోయేలా చేశాయి.

ప్రభాస్ నట విశ్వరూపం. రానా ఏ మాత్రం తగ్గని యాక్షన్. వెరసి బాహుబలి 2 ట్రైలర్ సూపర్ అన్పించేలా ఉంది. తెలుగుతో పాటు హిందీ మిగిలిన భాష‌ల్లో కూడా బాహుబ‌లి 2 ట్రైల‌ర్ రిలీజ్ చేశారు. ట్రైల‌ర్‌లో ప్ర‌భాస్ ‘అమరేంద్ర బాహుబలి అను నేను..అశేషమైన మాహిష్మతి ప్రజల ధన,మాన, ప్రాణాల సంరక్షకుడిగా ప్రాణ త్యాగానికి అయినా వెనకాడబోనని రాజమాత శివగామి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’ అని ప్రకస్తారు. తర్వాత సన్నివేశాలు చూడాల్సిందే తప్ప…చెప్పేవి కావు.

బాహుబ‌లి 2లో అనుష్క వార్ స‌న్నివేశాలు, అనుష్క – ప్ర‌భాస్ రొమాంటిక్ సీన్లు, ఫైన‌ల్‌గా అంద‌రూ ఎంతో ఉత్కంఠ‌తో ఎదురు చూస్తోన్న ప్ర‌భాస్ – రానా వార్ స‌న్నివేశాలు హైలెట్ కానున్నాయ‌ని తెలుస్తోంది. తొలి పార్ట్‌లో మిస్ అయిన ఎమోష‌న‌ల్ సీన్లు బాహుబ‌లి 2లో పీక్ స్టేజ్లో ఉంటాయ‌ని, ప్రేక్ష‌కుల హృద‌యం ద్ర‌వించేలా జ‌క్క‌న్న ఈ ఎమోష‌న‌ల్ సీన్లు తెర‌కెక్కించిన‌ట్టు ట్రైల‌ర్ చెపుతోంది.

ఇక క‌ట్ట‌ప్ప‌తో నువ్వు ప‌క్క‌న ఉన్నంత వ‌ర‌కు న‌న్ను చంపే మ‌గాడు ఇంకా పుట్టలేదు మామ అని ప్ర‌భాస్ అంటాడు. అయితే క‌ట్ట‌ప్పతో బాహుబ‌లిని బ‌ల‌వంతంగా వెన్నుపోటు పొడిపిస్తార‌ని ట్రైల‌ర్‌లో క‌ట్ట‌ప్ప హావ‌భావాలు చెప్పేస్తున్నాయి.

ఓవ‌రాల్‌గా ట్రైల‌ర్ రికార్డులు ఏ స్థాయిలో ఉంటాయో కూడా ఊహ‌కే అంద‌డం లేదు.