బాల‌య్య ” శాత‌క‌ర్ణి ” ఫ‌స్ట్ షో ఎక్క‌డ ఫిక్స‌య్యింది

బాల‌య్య 100వ సినిమా శాత‌క‌ర్ణి సంక్రాంతి కానుక‌గా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇప్ప‌టికే శాత‌క‌ర్ణి ఆడియో రిలీజ్ అయ్యి మంచి టాక్ సొంతం చేసుకుంది. ట్రైల‌ర్ కూడా యునానిమ‌స్ హిట్ టాక్ తెచ్చుకోవ‌డంతో అంద‌రూ శాత‌క‌ర్ణి కోసం ఎప్పుడు థియేటర్ల‌లో వాలిపోదామా అని ఉత్కంఠ‌తో వెయిట్ చేస్తున్నారు.

శాత‌క‌ర్ణి రిలీజ్ డేట్ ఇంకా ఫైన‌లైజ్ కాక‌పోయినా 12న రిలీజ్ ఉంటుంద‌ని టాక్‌. 5న సెన్సార్‌కు వెళుతోంది. ఇక ఈ సినిమా ప్రీమియ‌ర్ల హ‌డావిడి అప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఏపీలో అధికార టీడీపీ ఎమ్మెల్యేగా బాల‌య్య ఉండ‌డంతో పాటు ఈ ఫంక్ష‌న్‌కు కేంద్ర మంత్రి వెంక‌య్య‌తో పాటు సీఎం చంద్ర‌బాబు కూడా వ‌చ్చారు. చంద్ర‌బాబు కూడా ఈ సినిమాను త‌న వంతుగా ప్ర‌మోట్ చేస్తున్నారు.

ఇక ఓవ‌ర్సీస్‌లో 11నే ప్రీమియ‌ర్ల‌కు ప్లాన్ చేస్తున్నారు. అయితే అంత‌కంటే ముందే ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్రీమియ‌ర్ షో వేయించి చూపించాల‌ని చిత్ర‌యూనిట్ భావిస్తోంది. ఈ సినిమా ప్రారంభోత్స‌వానికి తెలంగాణ సీఎం కేసీఆర్ వ‌చ్చారు. అప్పుడు ఆయ‌నే స్వ‌యంగా త‌న‌కు షో వేసి చూపించాల‌ని బాల‌య్య‌ను కోర‌డం…బాల‌య్య ఓకే చెప్ప‌డం జ‌రిగిపోయాయి. ఇద్ద‌రు సీఎంల‌కు ఒకేసారి షో వేయాల‌నుకున్నా అది కుదిరేపనికాక‌పోవ‌డంతో ఇద్ద‌రికి వేర్వేరుగా స్పెష‌ల్ షో ప్లాన్ చేస్తున్నార‌ట‌.

ఇక వీరిలో ఏపీ సీఎం చంద్ర‌బాబు కోసం ముందుగా అమ‌రావ‌తిలో షో వేస్తున్న‌ట్టు తెలుస్తోంది. అమ‌రావ‌తిలో త‌న‌కు సినిమా చూపించ‌మ‌ని చంద్ర‌బాబు నాయుడే స్వ‌యంగా చిత్ర‌బృందాన్ని కోర‌డంతో క్రిష్ అండ్ టీమ్ ఈ నిర్ణ‌యం తీసుకొన్న‌ట్టు తెలుస్తోంది. అయితే ఈ షోకు డేట్ అండ్ టైం చంద్ర‌బాబే డిసైడ్ చేయాల్సి ఉంటుంది. మ‌రి కేసీఆర్ కూడా ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు హైద‌రాబాద్‌లో ఆయ‌న‌కు సైతం స్పెష‌ల్ షో వేయ‌నున్నారు. ఏదేమైనా ఇద్ద‌రు సీఎంలు శాత‌క‌ర్ణి స్పెష‌ల్ షోలు వీక్షిస్తుండ‌డంతో శాత‌క‌ర్ణికి పొలిటిక‌ల్ హంగులు అదిరిపోతున్నాయి.