ప‌వ‌న్ ప‌నికి క‌కావిక‌ల‌మైన మెగా ఫ్యాన్స్‌

మెగా ఫ్యాన్స్‌కి ప‌వ‌ర్‌స్టార్ దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చాడు! వాస్త‌వానికి ఫ్యామిలీ రిలేష‌న్స్‌లో కాస్త డిఫ‌రెంట్‌గా ఉండే ప‌వ‌న్‌.. గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. మెగా హీరోల మూవీల‌కు సంబంధించి ఏదైనా ఫంక్ష‌న్ జ‌రిగితే.. మ‌మ్మ‌ల్ని పిలిస్తే బాగుండు అనుకునే వాళ్లు వంద‌ల సంఖ్య‌లో ఉంటారు. అలాంటిది ప‌వ‌న్ మాత్రం త‌న సొంత ఫ్యామిలీకి కాస్త దూరంగానే ఉంటారు. రామ్ చ‌రణ్ కానీ, బ‌న్నీకానీ ఇలా ఎవ‌రి ఆడియోలేదా మూవీ ఫంక్ష‌న్ల‌కి ఆయ‌న హాజ‌రైంది లేదు. దీంతో అంద‌రూ ప‌వ‌న్‌కి ఆయ‌న ఫ్యామిలీకి పొస‌గ‌ద‌ని లెక్క‌లేశారు.

అయితే, విచిత్రంగా రామ్ చ‌ర‌ణ్‌కి ప‌వ‌న్ మ‌ధ్య మంచి కెమిస్ట్రీ ఉంది! ఇద్ద‌రి భావాలూ క‌లుస్తాయి. దీంతో వీరిద్ద‌రిపై ఎలాంటి రూమ‌ర్ లేదు. ఇక విష‌యంలోకి వెళ్తే.. ప‌వ‌న్ క్రియేటివ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్‌ను స్థాపించి మూవీ నిర్మాణంలోకి కూడా అడుగు పెట్టాడ‌ని టాక్‌. ఈ క్ర‌మంలో ఆయ‌న త‌న అబ్బాయి రామ్ చ‌ర‌ణ్‌తో మూవీ చేస్తార‌ని అభిమానులు అనుకున్నారు. అయితే, వీరంద‌రికీ షాక్ ఇస్తూ.. ప‌వ‌న్ పెద్ద స్టెప్ వేశాడు. త‌న‌ను ప్ర‌త్యేకంగా అభిమానించే అ.. ఆ.. హారో నితిన్ రెడ్డితో మూవీని స్టార్ట్ చేసేశాడు. అది కూడా అ.. ఆ. డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ డైరెక్ష‌న్‌లోనే!

దీనికి నిన్న కొబ్బ‌రికాయ కూడా కొట్టేసి.. క్లాప్ ఇచ్చేశారు. దీంతో ఇప్పుడు ఈ విష‌యంలో మెగా అభిమానులు మెగా టాపిక్ అయింది. చ‌ర‌ణ్‌తో మూవీ చేస్తాడ‌నుకుంటే ప‌వ‌న్ నితిన్‌తో కొబ్బ‌రికాయ కొట్టించాడేంట‌ని తెగ ఫీలైపోతున్నారు. . ‘ఎంతైనా.. నితిన్ అంటే ప‌వ‌న్‌కి మహా ఇది’ అనుకోవ‌డం త‌ప్ప‌… మెగా ఫ్యాన్స్ ఏమీ చెప్ప‌లేని పరిస్థితి. మ‌రోవైపు ప‌వ‌న్ పెట్టుబ‌డేం లేద‌ని.. అంతా నితిన్ డ‌బ్బే అని.. మ‌రో టాక్ న‌డుస్తోంది. ఏదేమైనా మెగా ఫ్యామిలీ క‌న్నా మెగా ఫ్యాన్స్‌కే ప‌వ‌న్ ప్రేమ కురిపిస్తాడ‌ని అభిమానులు సంబ‌ర‌పడుతుండ‌డం గ‌మ‌నార్హం.