శివబాలాజీ కి షాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డాలి దర్శకత్వం వహిస్తున్న కాటంరాయుడు సినిమా షూటింగ్ లో బిజీగా వున్నాడు. అయితే హీరో శివ బాలాజీ కూడా ఆ సినిమాలో పవర్ స్టార్ కి సోదరుడి పాత్రలో నటిస్తున్నాడు. అయితే అక్టోబర్ 14 వ తేదీ న అందరూ సినిమా షూటింగ్ లో ఉండగా డైరెక్టర్ డాలి పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి ఈ రోజు శివ బాలాజీ పుట్టినరోజు అని చెప్పాడట.

అయితే పవన్ కళ్యాణ్ శివ బాలాజీ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పి కేక్ కూడా ఆర్డర్ చేశారట. అదంతా చూసి శివబాలాజీ షాక్ అయ్యాడట. అంత పెద్ద స్టార్ హీరో తన తోటి నటుడి పుట్టిన రోజు వేడుక జరిపించటం పవర్ స్టార్ గొప్ప తనాన్ని తెలియజేస్తుందని చాలా ఆనందంగా ఫీల్ అయ్యాడట.