శాత‌క‌ర్ణి టీజ‌ర్‌కు ఎన్టీఆర్ ఫిదా

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ కేరీర్‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమాపై టాలీవుడ్ ట్రేడ్ వ‌ర్గాల‌తో పాటు ఇండ‌స్ట్రీ స‌ర్కిల్స్‌, సినీ జ‌నాల్లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. ద‌స‌రా కానుక‌గా విడుద‌లైన శాత‌క‌ర్ణి టీజ‌ర్ యూ ట్యూబ్‌లో దుమ్ము దులుపుతూ భారీ వ్యూస్ రాబ‌డుతోంది. ఇక తాజాగా శాత‌క‌ర్ణిలో మ‌హారాణి పాత్ర‌లో న‌టిస్తున్న హేమ‌మాలిని స్టిల్ కూడా రిలీజ్ అయ్యింది.

ఇదిలా ఉంటే శాత‌క‌ర్ణి టీజ‌ర్‌కు జూనియ‌ర్ ఎన్టీఆర్ ఫిదా అయిపోయిన‌ట్టు తెలుస్తోంది. శాత‌క‌ర్ణి టీజ‌ర్ ఇప్ప‌టికే ఇండ‌స్ట్రీలోని ప‌లువురు స్టార్ హీరోలు, సెల‌బ్రిటీల ప్ర‌శంస‌లు పొందింది. తాజాగా ఈ సినిమా టీజ‌ర్ చూసిన ఎన్టీఆర్ సైతం బాల‌య్య యాక్టింగ్‌, డైలాగ్స్‌కు ఫిదా అయిన‌ట్టు తెలుస్తోంది.

బాలకృష్ణతో కొంతకాలంగా ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నాడనే టాక్ నేపథ్యంలో… ఎన్టీఆర్ శాతకర్ణి టీజర్‌కు ఆకర్షితుడయ్యాడనే న్యూస్ పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. ఈ టీజ‌ర్ చూసిన తార‌క్ ఇలాంటి రోల్స్ బాల‌య్య బాబాయ్ మాత్ర‌మే చేయ‌గ‌ల‌డ‌ని… ఇత‌రులు ఇలాంటి పాత్రను సరిగ్గా పోషించలేరని ఎన్టీఆర్ తన సన్నిహితుల దగ్గర చెప్పాడట.

ఇక సంక్రాంతికి రిలీజ్ అవుతున్న‌ ఈ సినిమా కోసం సాధారణ మూవీ లవర్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారో… తాను కూడా అదే రకంగా వెయిట్ చేస్తున్నానని అన్నాడట. శాత‌క‌ర్ణి టీజ‌ర్ ఎన్టీఆర్‌ను ఇంప్రెస్ చేయ‌డం వ‌ర‌కు బాగానే ఉంది. మ‌రి ఎన్టీఆర్ ఇదే విష‌యాన్ని ఓపెన్‌గా చెపితే బాబాయ్‌-అబ్బాయ్ గ్యాప్ ప‌టాపంచ‌లైపోయిన‌ట్టే క‌దా..!