సమంత ఎన్టీఆర్ వాటర్‌ఫాల్ సందడి!

‘జనతా గ్యారేజ్’ షూటింగ్ కేరళలో జోష్‌గా సాగిపోతోంది. అక్కడే ఓ వాటర్‌ఫాల్స్ లొకేషన్‌లో హీరోహీరోయిన్లు ఎన్టీఆర్-సమంతాలపై ఓ పాట కోసం కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. స్క్రిప్ట్ ప్రకారం.. నీటి జడిలో  ఎన్టీఆర్-సమంతాలు తడవాలి.

ఈ సీన్ పూర్తైన తర్వాత.. సమంతా ఓ రేంజ్‌లో సందడి చేసిందట. డైరక్టర్ కొరటాల శివను కూడా బలవంతంగా వాటర్‌ఫాల్‌ కిందకు లాక్కొచ్చి తడిపేసిందట. ఈ చిత్రాలన్నీ సోషల్‌మీడియాలో పోస్ట్ చేసి.. తన అల్లరిని అభిమానులకు మరోసారి వివరించింది అందాల సామ్.