ఎక్కడ చూసినా సమంతే.

ఈ మధ్య సమంత వార్త లేని రోజు లేదంటే అతిశయోక్తి కాదేమో.అంతలా హల్చల్ చేస్తుందీ అమ్మడు.నాగ చైతన్య తో ప్రేమాయణం ఏ ముహూర్తాన బయటకొచ్చిందో కానీ ఈ అమ్మడు రోజు కవర్ పేజీ లో ప్లేస్ కొట్టేస్తోంది.

ఇక సోషల్ మీడియా లో అయితే ఎప్పుడు అభిమానులకి టచ్ లో ఉంటుంది సమంత.ఎప్పటికప్పుడు ట్విట్టర్ ఇంస్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియాల్లో ఎదో ఒక విషయమో, ఫోటోనో షేర్ చేస్తూ హంగామా సృష్టిస్తోంది.ఆ మధ్యన ఏకంగా నాగచైతనయ ప్రేమ వ్యవహారం పై అభిమానుల ప్రశ్నలకి ఆసక్తికర ట్వీట్స్ పెట్టి అందర్నీ ఆశ్చర్య పరిచింది.

ఇక ఈ రోజయితే..ఎన్టీఆర్ కొరటాల తో జనతా గ్యారేజ్ కేరళ షూటింగ్ లో వాటర్ ఫాల్ దగ్గర నానా హంగామా చేసేసింది.అంతలోనే తన తోటి నటీమణులతో కలిసున్నా ఫోటో ఒకటి ట్వీట్ చేసింది.ఆ ఫొటోలో సమంత,రకుల్,రెజీనా తో కామన్ ఫ్రెండ్ కూడా వుంది.అయితే అందరిలో సమంతా నే సెంటర్ అఫ్ అట్రాక్షన్ అయ్యేలా అందాల ఆరబోసింది.