ఆ సీక్వెల్ కి బాలయ్య సై అంటాడా?

నందమూరి నట సింహం బాలకృష్ణ సీక్వెల్ ఇప్పటిదాకా చేయలేదు.ఆ మాటకొస్తే బాలయ్య రీమేక్ లకి సీక్వెల్ సినిమాలకి చాలా దూరంగా వుంటారు.అయితే బాలకృష్ణ సూపర్ హిట్ సినిమా ఆదిత్య-369 కి సీక్వెల్ గా ఆదిత్య-999 సినిమా నే 100 వ సినిమాగా చేస్తాడన్న ప్రచారం సాగింది.అయితే అది పట్టాలెక్కలేదు ఈ లోగా శాతకర్ణి కి పచ్చ జెండా ఊపేసాడు బాలయ్య.

అయితే తాజాగా బాలకృష్ణ సూపర్ హిట్ సినిమాల్లో ఒకటిగా నిలిచిన లక్ష్మి నరసింహ చిత్రం తమిళ్ లో విక్రమ్ నటించిన సామి సినిమాకి రీమేక్.అప్పట్లో ఆ సినిమా 270 పైచిలుకు కేంద్రాల్లో అర్ద శతదినోత్సవం జరుపుకుని అల్ టైం రికార్డు క్రియేట్ చేసింది.అయితే ఇప్పుడు తమిళ్ లో విక్రమ్ సామీ కి సీక్వెల్ గా సామి-2 సినిమాని తీయబోతున్నట్టు ప్రకటించాడు.అయితే విక్రమ్ దారిలోనే బాలయ్య కూడా లక్ష్మీనరసింహ కి సీక్వెల్ తీస్తాడా లేదా అన్న ప్రచారం జోరందుకుంది.