రెండు రోజుల్లో చిరు వచ్చేస్తున్నాడు

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిరంజీవి 150 వ సినిమా 1st లుక్ మరో రెండు రోజుల్లో మనముందుకు వచ్చేస్తోంది.ఇదేదో గాసిప్ అనుకునేరు..స్వయంగా అల్లు అరవింద్ ఈ విషయాన్నీ ధ్రువీకరించాడు.ఇంకేముంది ఇంకో రెండు రోజుల్లో మెగా అభిమానులకి పండగే మరి.

ఎన్నో రకాల కథలు,దర్శకుల్ని పరిశీలించిన తరువాత..ఫైనల్ గా తమిళ్ కత్తి ని రీమేక్ చేయాలని దాన్ని మాస్ డైరెక్టర్ వినాయక్ అయితే బాగా హేండిల్ చేస్తాడని చివరికి అలా ఫిక్స్ అయిందే ఈ మెగా 150 వ సినిమా.

ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరనే దానిపైనా పెద్ద కసరత్తు తో కూడిన నిరీక్షణే జరిగింది..అనేకానేకమంది పేర్లు పరిశీలించి వినిపించినా ఫైనల్ గా ఆ లక్కీ ఛాన్స్ కాజల్ అగర్వాల్ కొట్టేసింది.ఇక ఈ సినిమాకి ఎనర్జిటిక్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా,స్వయంగా చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తేజ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.