రజనీకాంత్‌ రెడీ అయ్యేదెప్పుడు?

‘కబాలి’ సినిమాతో సెన్సేషన్‌ సృష్టించాడు సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌. తదుపరి చిత్రం ‘రోబో 2.0’లో నటిస్తున్నాడు రజనీకాంత్‌. ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం అయ్యి చాలా కాలమే అయ్యింది. రజనీ మీద ఆల్రెడీ కొన్ని సీన్స్‌ చిత్రీకరణ ఇప్పటికే జరిగింది. కానీ చాలా గ్యాప్‌ వచ్చేసింది ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొని రజనీ. ‘కబాలి’తో బిజీగా ఉండడం, ఆ తర్వాత అనారోగ్యంతో చికిత్స నిమిత్తం విదేశాలకు వెళ్లడం ఇలా ఈ సినిమాకి బ్రేక్‌ వచ్చింది. అయితే విదేశాల్లో చికిత్స అనంతరం ఇండియాకి రజనీ తిరిగి రావడం జరిగింది కానీ ఇంకా ఆరోగ్య పరంగా అంత ఫిట్‌ లేడు అని తెలుస్తోంది.

అందుకే రజనీ కాంత్‌ లేకుండానే మిగిలిన తారాగణంపై ఈ సినిమా షూటింగ్‌ నడిపించేస్తున్నాడు డైరెక్టర్‌ శంకర్‌. తొలి పార్ట్‌ ‘రోబో’ అంచనాలను మించి వసూళ్లను అందుకుంది. అంతకుమించి అన్న రేంజ్‌లో ఈ సినిమా ఉండాలని టెక్నికల్‌గా చాలా హంగులు ఈ సినిమాకి జోడిస్తున్నాడు శంకర్‌. ఈ సినిమాలో అమీజాక్సన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ ప్రతినాయకి పాత్ర ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ కానుంది. ఇప్పటికే ఈ సినిమాలో అక్షయ్‌ పాత్రకు సంబంధించిన పోస్టర్‌కు మంచి రెస్పాన్స్‌ లభించింది. ఇక రజనీకాంత్‌ షూటింగ్‌లో పాల్గొనడమే తరువాయి. అతి త్వరలోనే ఆయన కూడా సెట్స్‌లో సండి చేయనున్నారని తాజా సమాచారమ్‌.