రీ ఎంట్రీకి సై అంటోన్న యోగా బ్యూటీ 

శిల్పాశెట్టి ఈ ముద్దుగుమ్మ అందం అందరికీ సుపరిచితమే. తెలుగులోనూ పలుచిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మకు బాలీవుడ్‌లో మంచి పేరు ఉంది. అయితే కెరీర్‌ బాగున్న టైంలోనే ఈ అమ్మడు పెళ్లి చేసుకుని సెటిలై పోయింది. పెళ్లయ్యాక ఈ ముద్దుగుమ్మ సినిమాలకు దూరం అయ్యింది. కానీ పెళ్లయ్యాక కూడా తనకు సినిమా ఆఫర్స్‌ వచ్చాయట. కానీ తాను మెచ్చే పాత్రలు కావవి. అందుకే నటించడానికి ఇష్టపడలేదు అంటోంది. కానీ టీవీ షోస్‌లోనూ, కమర్షియల్‌ యాడ్స్‌లోనూ ఈ బ్యూటీ విరివిగా కనిపిస్తూనే ఉంది. కానీ ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ మళ్లీ సినిమాల్లో నటించడానికి సై అంటోందట. బాలీవుడ్‌లోనే కాకుండా, టాలీవుడ్‌, కోలీవుడ్‌ ఏ భాషకైనా తాను రెఢీ అంటోంది.

పెళ్లై ఒక బిడ్డకు తల్లి అయినా కానీ ఆమెలోని అందం రవ్వంతయినా తరగలేదు. మరింత అందంగా తయారయింది. ఇప్పటికే బాలీవుడ్‌లో పెళ్లి అయినాక కూడా చాలా మంది హీరోయిన్లు తమ హవా చూపిస్తున్నారు. వాళ్లందరితో పోలిస్తే తాను కూడా దేంట్లోనూ ఏ మాత్రం తీసిపోనంటుంది ముద్దుగుమ్మ శిల్పాశెట్టి. తెలుగులో ఈ ముద్దుగుమ్మ వెంకటేష్‌తో నటించిన ‘సాహసవీరుడు సాగరకన్య’ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ అయ్యింది. తెలుగులో సీనియర్‌ హీరోల హవా నడుస్తున్న ప్రస్తుత తరుణంలోనే తన ఎంట్రీ ఇవ్వడం మంచిదనుకుంది కాబోలు ఈ ముద్దుగుమ్మ శిల్పాశెట్టి. ఏదేమైనా ఇది రైట్‌ టేమే. ఆమె ఆశించనట్లు తెలుగులో ఈ అమ్మడికి సీనియర్‌ హీరోల పక్కన ఏమైనా ఛాన్స్‌ దొరుకుతుందేమో చూద్దాం.