నాలుక కొస్తే 50 లక్షలట

రాజకీయనాయకులు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి..విమర్శలు హద్దుల్లో ఉండాలి.లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు.మీది ముఖంగా ఇష్టం వచ్చినట్టు ఎదుటి వారిపై విమర్శలు చేస్తే అవి తిరిగి తమ మెడకే చుట్టుకుంటాయి.అందులోనా దళితులు..మరీ ముక్యంగా మహిళల గురించి మాట్లాడేటప్పుడు ఎంతో హుందాగా విమర్శలుండాలే తప్ప వ్యక్తి గతంగా..మహిళలను కించపరిచే విధంగా ఉంటే వాటి పర్యవసానం ఎలా ఉంటుందో ఉత్తరప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడు దయాశంకర్ సింగ్ ని అడిగితే చెప్తాడు.

మాయావతి తీరు వేశ్యకంటే దారుణమంటూ నోరు జారి ఆయన కష్టాలు కొనితెచ్చుకున్నారు.ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా మాయావతి పార్టీ టికెట్స్ అమ్ముకుంటోందని,కోటి ఇస్తే ఒకరికి టికెట్ ఇచ్చేసి వెంటనే రెండు కోట్లిస్తే వేరే వాళ్లకు,ఆపైన మూడు కోట్లు ఆఫర్ చేస్తే మరొకరికి ఇలా టికెట్స్ అమ్మేస్తోందని,ఆమె తీరు వేశ్య కంటే దారుణంగా ఉందని తీవ్ర పదజాలంతో విమర్శించారు.

అంతే దేశం మొత్తం మాయావతికి మద్దతుగా నిలిచిన్నది.దయాశంకర్ సింగ్ ని ఆరేళ్ళ పాటు బీజేపీ సస్పెండ్ చేసింది.ఆయనపై పోలీసులు అరెస్ట్ వాఱేన్ట్ జారీ చేశారు.యూపీ మొత్తం నిరసనలు వెల్లు వెత్తుతున్నాయి.ఎంతగా అంటే దయాశంకర్ నాలుక కోసి తెచ్చిన వారికి 50 లక్షల రూపాయలు ఇస్తానని ఛండీగడ్ నగర బీఎస్పీ అధ్యక్షురాలు జన్నత్ జహాన్ ప్రకటించారు.దయాశంకర్ సింగ్ వ్యాఖ్యలు బీజేపీ కి రానున్న యూపీ ఎన్నికల్లో శాపంగా మారనున్నాయి.యూపీ లో దళిత జనాభా అధికం..వారే యూపీ రాజకీయాల్ని అధిక భాగం శాసిస్తుంటారు.అలాంటిది దళిత మహిళ అయిన మాయావతిపై బీజేపీ అధ్యక్షుడి వివాదాస్పద వ్యాఖ్యలు బీజేపీ భవితవ్యం పై తీవ్ర ప్రభావాన్నే చూపనున్నాయి.