రైతులపై దూసుకు వెళ్ళిన కారు.. బిజెపి నేతల అరాచకం.. వీడియో వైరల్..!

దేశవ్యాప్తంగా ఇప్పుడు సంచలనంగా మారిన వీడియో ఇదే. యూపీలోని లఖింపర్ ఖేరి అరాచకాన్ని ఇంతవరకు కేవలం విన్నాము అందుకు సంబంధించిన వీడియో తాజాగా ఇప్పుడు బయటికి వచ్చి వైరల్గా మారుతుంది. ఇక తమ దారిన తాము నడుచుకుంటూ వెళుతున్న రైతులపై ఏమాత్రం కనికరం లేకుండా వాహనంతో దేశం ముందుకు వెళ్లిన బిజెపి నేతల అరాచకం ఏ స్థాయిలో ఉందో ఈ వీడియోలో కనిపిస్తోంది. అధికారంలో ఉన్నంత మాత్రాన మనుషుల ప్రాణం వీరికి లెక్కలేనంత స్థితిలో ఉన్నట్లుగా కనిపిస్తుంది. […]

అప్పుడు చెంప చెల్లుమ‌నిపించింది..ఇప్పుడు రాఖీ క‌ట్టేసింది!

నడి రోడ్డుపై బిజీ ట్రాఫిక్​ మధ్యన సాదత్ అలీ సిద్ధిఖీ అనే క్యాబ్‌ డ్రైవ‌ర్‌ను ప్రియదర్శిని నారాయణ్ యాదవ్ అనే యువ‌తి 22 సార్లు చెంపదెబ్బలు కొట్టిన ఘటన గుర్తిండే ఉంటుంది. యూపీ రాజధాని లక్నోలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న మొన్నా మ‌ధ్య తీవ్ర క‌ల‌క‌లం రేపింది. ఈ ఘ‌ట‌న‌లో చివ‌ర‌కు ప్రియ‌ద‌ర్శ‌నిదే త‌ప్పని తేల‌డంతో.. నెటిజ‌న్లు ఆమెపై విరుచుకుప‌డ్డారు. కొంద‌రు ఆమెను అరెస్ట్ చేయాల‌ని డిమాండ్ చేశారు. అయితే ఇప్పుడు ప్రియ‌ద‌ర్శ‌ని మ‌రోసారి వార్త‌ల్లో హాట్ […]

ఐదు ల‌క్ష‌లు వ‌స్తాయ‌న్నారు.. అత్యాచారం చేశారు..!

మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు అంతే లేకుండా పోతోంది. మ‌రీముఖ్యంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప‌రిస్థితి దారుణంగా మారిపోయింది. మృగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. సొంత ఇంట్లోనే స్త్రీకి రక్షణ లేకుండా పోతోంది. పనిచేసే ఆఫీసుల్లో, చదువుకునే కాలేజీల్లో, స్కూళ్లల్లో కూడా ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతోంది. తాజాగా మ‌రో సంఘ‌ట‌న వెలుగుచూసింది. ప్రధానమంత్రి మోదీ రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.5 లక్షలు ఇప్పిస్తామ‌ని న‌మ్మ‌బ‌లికి ఓ వితంతువుపై ఇద్ద‌రు యువ‌కులు అత్యాచారానికి తెగ‌బ‌డ్డారు. అక్క‌డితో ఆగ‌కుండా ఆ తతంగాన్నంతా వీడియో […]

ఎస్పీ ఫ్యామిలీ డ్రామాలో మ‌రో ట్విస్ట్‌

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు ఊహించ‌ని మ‌లుపులు తిరుగుతున్నాయి. ఒక్క‌సారిగా యూపీలో బీజేపీ జెండా రెప‌రెప‌లాడిన ద‌గ్గ‌ర నుంచి..ఎన్నో ఆస‌క్తిక‌ర స‌న్నివేశాలు జరుగుతున్నాయి. యూపీ ముఖ్య‌మంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్ర‌మాణ స్వీకారం రోజున‌.. బ‌ద్ధ శ‌త్రువులైన ఎస్పీ అధినేత ములాయంసింగ్‌, ప్ర‌ధాని మోదీ చాలాసేపు మాట్లాడుకోవ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఇది జరిగిన కొద్దిరోజుల‌కే ములాయం చిన్న కొడుకు, కోడ‌లు పార్టీని వీడ‌తార‌నే ప్ర‌చారం అక్క‌డి మీడియాలో జోరందుకుంటోంది. వీరు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నార‌ని, ఈ మేర‌కు బీజేపీ […]

2019లో మోడీకి యాంటీగా థ‌ర్డ్ ఫ్రంట్‌

ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాలు, యూపీలో బీజేపీ ఘ‌న‌విజ‌యం చూశాక ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా అంద‌రి దృష్టి 2019 మీదే ఉంది. 2019 ఎన్నిక‌ల్లో మ‌రోసారి కేంద్రంలో ఎన్డీయే గెలుస్తుందని… ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ వ‌రుస‌గా రెండోసారి అధికారంలోకి వ‌స్తార‌న్న అంచ‌నాలు వ‌చ్చేశాయి. ఫ్యూచ‌ర్‌లో అస్స‌లు ప్రాంతీయ పార్టీల మీద ఆధార‌ప‌డ‌కుండా నార్త్ టు సౌత్ వ‌ర‌కు తిరుగులేని శ‌క్తిగా ఎద‌గాల‌నుకుంటోన్న మోడీ అందుకు త‌గ్గ‌ట్టుగానే ప్రాంతీయ పార్టీల‌ను చాలా వ్యూహాత్మ‌కంగా అణ‌గ‌దొక్కేస్తున్నారు. ఓ ప‌క్క కాంగ్రెస్ దానంత‌ట అదే […]

టాలీవుడ్ అగ్ర నిర్మాత ఆశ‌ల‌కు అఖిలేశ్ గండి

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల విజ‌యం ఎంతోమంది ఆశ‌లకు గండి క‌ట్టింది. ఈ విజ‌యంతో ప్ర‌ధాని మోదీ కంటే తాను గ్రేట్ అనిపించుకోవాల‌ని కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ, త‌న పాల‌న‌కు ప్ర‌జ‌లు ప‌ట్టం క‌డ‌తార‌ని భావించిన మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్ భావించారు. కానీ వీరిద్ద‌రికీ పెద్ద షాక్ త‌గిలింది. ఇదే స‌మ‌యంలో టాలీవుడ్ బ‌డా నిర్మాత బండ్ల గ‌ణేష్‌కు కూడా బీజేపీ విజ‌యాన్ని త‌ట్టుకోలేక‌పోతున్నార‌ట‌. త‌న ఆశ‌ల‌ను బీజేపీ చిదిమేసింద‌ని తెగ బాధ‌ప‌డుతు న్నార‌ట‌. అదేంటి బీజేపీ […]

యూపీలో బీజేపీ విజ‌యం – జ‌గ‌న్‌కు కొత్త టెన్ష‌న్‌

ఉత్త‌రప్ర‌దేశ్‌లో ఎస్పీ ఓట‌మి.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తించేలా చేస్తోంది! ప్ర‌ధాని మోడీ విజ‌యం ఎలా ఉన్నా.. కాంగ్రెస్‌-ఎస్పీ కూట‌మి ప‌రాభవం జ‌గ‌న్‌కు కంటి నిండా కునుకు లేకుండా చేస్తోంది. ఇలా అయితే ఏపీలో త‌న ప‌రిస్థితి ఏంటా అనే గుబులు మొద‌లైంద‌ట‌. అక్క‌డి ఫ‌లితాల‌కీ.. జ‌గ‌న్‌కీ ఉన్న లింక్ ఏంట‌నేగా మీ సందేహం? ఆ లింక్ పేరే ప్ర‌శాంత్ కిషోర్‌!! బిహార్ ఎన్నిక‌ల్లో నితీష్‌కుమార్‌కు వ్యూహ‌క‌ర్త‌గా నిలిచిన ప్ర‌శాంత్‌ను.. ఏరికోరి జ‌గ‌న్ […]

యూపీలో గెలుపెవ‌రిది?  బెట్టింగుల జోరు!

దేశంలో అతిపెద్ద రాష్ట్రం ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో ఇప్పుడు బెట్టింగ్ బంగార్రాజులు పెరిగిపోయారు. ప్ర‌స్తుతం ఐదు ద‌శ‌ల ఎన్నిక‌లు పూర్త‌యిన నేప‌థ్యంలో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వ‌స్తుంది? ఏ పార్టీ మెజారిటీ ఓట్లు సాధిస్తుంది? ఏ పార్టీ నేల మ‌ట్ట‌మ‌వుతుంది? ప్ర‌ధాని మోడీ హ‌వా ఏ మేర‌కు ప‌నిచేస్తుంది? అమిత్ మంత్రాంగం ఎన్ని సీట్లు, ఓట్లు రాలుస్తుంది? వ‌ంటి విష‌యాల‌పై పెద్ద ఎత్తున బెట్టింగులు సాగుతున్నాయి. ఈ బెట్టింగులు రూ.కోట్ల‌లో సాగుతుండ‌డంతో దేశం దృష్టంతా ఇప్పుడు యూపీపైనే ప‌డింది. […]

యూపీలో కూడా అదే రిజ‌ల్ట్ వ‌స్తుందా..!

దేశంలోనే పెద్ద రాష్ట్ర‌మైన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో విజ‌యం కోసం అధికార ఎస్పీతో పాటు అక్క‌డ ప్ర‌ధాన పార్టీ అయిన బీఎస్పీ, జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతున్నాయి. ఇక్క‌డ విజ‌యం సాధిస్తే 2019 ఢిల్లీ పీఠానికి మార్గం చాలా వ‌ర‌కు సుగ‌మం అయిన‌ట్టే. అందుకే దేశంలోనే పెద్ద రాష్ట్ర‌మైన ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ను త‌మ గుప్పెట్లోకి తెచ్చుకునేందుకు పైన చెప్పిన పార్టీల‌న్ని స‌ర్వ‌శ‌క్తులా పోరాడుతున్నాయి. అయితే ప్ర‌స్తుతం అక్క‌డ ఉన్న ట్రెండ్‌ను బ‌ట్టి చూస్తుంటే, జాతీయ మీడియాలో జ‌రుగుతున్న […]