లైలాని మళ్ళీ తెస్తున్న బన్నీ!

ఒక లైలా కోసం,ముకుంద సినిమాల్లో అందంతో,అభినయంతో తెలుగువారి మనసుని దోచుకున్న ముంబై ముద్దుగుమ్మ పూజా హెగ్డే ఆతరువాత ఇంతవరకు మళ్ళీ కనిపించలేదు. దానికి ఓ పెద్ద కారణం ఉంది.అశుతోష్ గౌరికర్ తెరకెక్కించిన మొహంజదారో సినిమాలో హృతిక్ రోషన్ సరసన యువరాణి పాత్ర కోసం రెండేళ్ళపాటు మరే సినిమాకి సంతకం చేయలేదు.

కాగా తాజాగా ఈ అమ్మడు ఓ తెలుగు సినిమాకి ఓకె చెప్పినట్టు సమాచారం. దిల్ రాజు నిర్మాతగా హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ సినిమాలో నటించనున్నట్టు ఇటీవల ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. ఆగష్ట్ లేదా సెప్టెంబర్‌లో సెట్స్‌మీదికెళ్ళనున్న ఈ సినిమాలో బన్నీకి జోడీగా పూజా హెగ్డేను సంప్రదించారట. ఇప్పటికే రెండేళ్ళ కాలాన్ని ఒక్కగానొక్క సినిమాకి కేటాయించిన పూజా ఇంకా ఆచితూచి అడుగులేయడం సబబు కాదని వెంటనే అంగీకారం తెలిపిందట. ఓ రకంగా పూజా నిర్ణయం సరైందనే చెప్పాలి. హీరోయిన్ కెరీర్లో రెండేళ్ళ కాలం అంటే మా మూలు విషయం కాదు. ఎంత కాదన్నా ఓ మూడు, నాలుగు సినిమాలు చుట్టేయచ్చు. మొహంజదారో సినిమాకి పూజా ఎందుకు అంత ప్రాము ఖ్యత ఇచ్చిందో తెలియాలంటే ఆగష్టు 12 వరకూ ఆగా ల్సిందే.

ఇది ఏమైనా బన్నీతో టాలీవుడ్ రీఎంట్రీ ఈ అమ్మడికి బాగా కలిసొచ్చే అంశం.టాలీవుడ్ నయా లైలాని బన్నీ తిరిగి తీసుకువస్తున్నాడన్నమాట