మెగాస్టార్‌కి మెగా ఫ్యాన్‌ అతడే 

మెగాస్టార్‌ చిరంజీవికి అభిమానులెంతమంది ఉన్నారు? అని ప్రశ్న వేస్తే సమాధానం చెప్పడం కష్టం. సినీ పరిశ్రమలోనే లెక్కలేనంతమంది అభిమానులు ఆయన సొంతం. నేను చిరంజీవి అభిమానినని చెప్పుకోడానికి గర్వపడతారు సినీ పరిశ్రమలో. అలాంటిది మెగా ఫ్యామిలీలో చిరంజీవికి వారసులే కాదు, హార్డ్‌కోర్‌ ఫ్యాన్స్‌ ఉండకుండా ఉంటారా? ఆ హార్డ్‌కోర్‌ అభిమాని ఎవరో కాదు, అల్లు అర్జున్‌. మొన్న ఓ సినిమా ఫంక్షన్‌లో పవన్‌కళ్యాణ్‌ అభిమానులతో వచ్చిన గ్యాప్‌ని క్లియర్‌ చేసుకున్న అల్లు అర్జున్‌, మెగాస్టార్‌ అనే చెట్టు నీడన తామంతా ఎదుగుతున్నామని వివరించాడు.

లేటెస్ట్‌గా సినీ మా అవార్డ్స్‌ కార్యక్రమంలో స్టేజ్‌ మీద చిరంజీవి డాన్సులు ఇరగదీసేస్తోంటే అల్లు అర్జున్‌ కళ్ళు చెమర్చాయి. ఇవి ఆనంద భాష్పాలు, ఉద్వేగంతో వచ్చిన కన్నీళ్ళు అవి. తొమ్మిదేళ్ళు మెగాస్టార్‌ సినిమాలకు గ్యాప్‌ తీసుకోవడం చిన్న విషయం కాదు. రెండు దశాబ్దాలలు ఆయన సినీ రంగానికి దూరమయ్యారు. అలాంటిది, తిరిగి సినిమాల్లోకి వస్తున్న చిరంజీవికి సినీ మా అవార్డ్స్‌ వేదిక పలికిన ఆహ్వానం అలాంటిలాంటిది కాదు. అందుకే అల్లు అర్జున్‌ అలా కంటతడి పెట్టుకున్నాడని అందరూ అంటున్నారు. మరి ఫ్యామిలీలోనే ఇంత గొప్ప అభిమాని ఉండడం గొప్పే కదా. చిన్నప్పటినుంచీ బన్నీ, చిరంజీవి డాన్సులు చూస్తూ పెరిగాడు. అలాగే చిరంజీవి హీరోగా నటించిన ‘డాడి’ చిత్రంతోనే అల్లు అర్జున్‌ తెరగేట్రం చేశాడు. అందుకే అల్లు అర్జున్‌కి, చిరంజీవి అంటే అంత ప్రత్యేకమైన అభిమానం. అల్లు అర్జున్‌ ఒక్కడే కాదు, చిరంజీవి అభిమానులంతా మెగాస్టార్‌ చిరంజీవిని స్టేజ్‌ మీద చూసి భావోద్వేగంతో ఊగిపోయారు. అది మెగా పవర్‌.