నిన్న మొన్నటి వరకు గౌతం రెడ్డి పేరు విజయవాడ రాజకీయాలు, విజయవాడ వ్యవహారాలకే పరిమితం అయింది. కానీ, వంగవీటి రంగాపై ఆయన చేసిన వ్యాఖ్యలతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు వచ్చారు. నిజానికి రంగా తనయుడు రాధాకృష్ణ అన్నట్టు.. రంగాను విమర్శించే స్థాయి గౌతం రెడ్డికి లేనే లేదు. అయినా కూడా తన స్థాయిలేని వ్యక్తి, తన స్థాయి కాని వ్యక్తిని విమర్శించడం ద్వారా రాష్ట్ర వ్యాప్త చర్చకు దారి తీయడం వెనుక పెద్ద ప్లాన్ ఉందని అంటున్నారు […]
Tag: ysrcp
వైసీపీ మైనస్‌లే బాబును హీరోను చేస్తున్నాయా..!
ఏపీలో సైకిల్ జోరుగా హుషారుగా దూసుకుపోతోంది. ప్రతిష్టాత్మకంగాను, హోరాహోరీగాను జరుగుతాయని టీడీపీ వాళ్లు అంచనాలు వేసుకున్న ఎన్నికల్లో సైతం వైసీపీ బొక్కబోర్లాపడిపోతోంది. సైకిల్ స్పీడ్‌కు ఫ్యాన్ రెక్కలు తెగికింద పడిపోతున్నాయి. నంద్యాల, కాకినాడ, కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు అంచనాలకే అందని విధంగా టీడీపీ గెలుస్తుండడంతో ఆయన కూడా ఫుల్ జోష్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హీరో ఎవరంటే నిస్సందేహంగా చంద్రబాబే అని చెప్పాలి. నంద్యాలలాంటి చోట్ల జగన్ ఏకంగా 15 రోజులు మకాం వేసి […]
ఆ ప్లాన్‌తోనే వంగవీటిపై గౌతంరెడ్డి వ్యాఖ్యలు!
ఊరకరారు మహానుభావులు- అన్నట్టుగానే.. రాజకీయ నేతలు సైతం తమ నోటిని ఊరికేనే పారేసుకుంటారా చెప్పండి? తమకు ఏమీ లాభం చేకూరదన్నప్పుడు అడుగు తీసి అడుగు కూడా వేయని నేతలు.. ఒక్కసారిగా కలకలం సృష్టించేలా? ఒక్కసారిగా తన పేరు బయటకు వచ్చేలా? తన చుట్టూతానే రాజకీయాలు నడిచేలా? తన పేరు రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగేలా చేశారంటే.. దాని వెనుక స్కెచ్.. ప్లాన్ అంతా ఇంతా ఉంటుందని ఊహించలేం. ఇప్పుడు అలాంటి భారీ స్కెచ్‌తోనే విజయవాడలో మాజీ కమ్యూనిస్టు నేత, […]
భగ్గుమన్న వంగవీటి ఫ్యాన్స్…. బంధువును బయటకు పంపేసిన జగన్
మూలిగే నక్కమీద తాటిపండు చందంగా ఉన్న బెజవాడ వైసీపీలో ఇప్పుడు పెద్ద ముసలం మొదలైంది. వైసీపీ ట్రేడ్ యూనియన్ నాయకుడు పూనూరు గౌతంరెడ్డి కాపులతో పాటు వంగవీటి రంగా, ఆయన తనయుడు రాధాపై చేసిన వ్యాఖ్యలు పార్టీని అట్టుడికించాయి. గౌతంరెడ్డి ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దివంగత నేత వంగవీటి మోహన్‌రంగా సహా వైసీపీ నాయకులపై చేసిన తీవ్ర వ్యాఖ్యలు అటు పార్టీలోను, ఇటు కాపుల్లోను తీవ్ర కలకలం రేపాయి. కాపులు, వంగవీటి అభిమానులు అయితే గౌతంరెడ్డితో […]
మరోసారి హీటెక్కనున్న నంద్యాల పాలిటిక్స్.. శిల్పాకు మరో షాక్..?
అబ్బా నంద్యాల ఉప ఎన్నిక ఏపీలో ఎలాంటి హీట్‌ను పుట్టించిందో చూశాం. ఈ హీట్ ఏకంగా నెల రోజుల పాటు అధికార టీడీపీ విపక్ష వైసీపీ నాయకుల మధ్య మాటల తూటాలు పేల్చింది. ఉప ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు అదిరిపోయాయాయి. ఈ ఎపిసోడ్ మొత్తం ట్విస్టులతో అదిరిపోయింది. టీడీపీలో ఉన్న శిల్పా మోహన్‌రెడ్డి వైసీపీలోకి వచ్చి క్యాండెట్ అవ్వడం, ఆ తర్వాత టీడీపీలోనే ఉన్న ఆయన సోదరుడు చక్రపాణిరెడ్డి కూడా వైసీపీలోకి […]
జగన్‌పై టీడీపీ అంచనాలు తారుమారు!
ఇప్పుడు ఈ కామెంట్లు వైసీపీ సోషల్ మీడియాలో హోరెత్తుతున్నాయి. జగన్‌ను టైగర్‌తో పోలుస్తూ.. పలువురు పోస్టింగులు దంచికొడుతున్నారు. దీనికి కారణం.. నంద్యాల, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో అతి పెద్ద దెబ్బ తగిలిన వైసీపీ ఇక నామరూపాలు లేకుండా పోతుందని, ఆ పార్టీ ఇక కోలుకోవడం కష్టమని భావించిన టీడీపీ పెద్దలకు జగన్ షాకివ్వడమే. నిజానికి నంద్యాల ఉప ఎన్నికను జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. గెలుపు తథ్యం అనుకున్నాడు. శక్తికి మించి ప్రచారం చేశాడు. ఓ రాష్ట్ర […]
వైసీపీకి మంచి జోష్..ఒకేసారి నలుగురు మాజీ మంత్రులు!
ఏపీలో ప్రతిష్టాత్మకంగా జరిగిన నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ కాస్త నిస్తేజంలో ఉంది. ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో చాలా మంది టీడీపీ వైపు చూస్తున్నట్టు కూడా మీడియాలో వార్తలు వస్తున్నాయి. కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని టీడీపీ మంత్రులు కూడా ప్రకటిస్తున్నారు. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఆ పార్టీలోకి వెళ్లే సాహసం ఎవరైనా చేస్తారా ? అన్న సందేహాలు చాలా మందికి ఉంటాయి. అయితే రాజకీయాల్లో అవకాశం కోసం కాచుకుని కూర్చొనే […]
తెలుగు ప్రజల మదిలో చెరగని ముద్ర వైఎస్ఆర్
తెలుగు ప్రజల మదిలో చెరగని ముద్ర వేసుకున్న రాజకీయ నాయకులు చాలా మందే ఉన్నారు. ఈ జాబితాలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ఒకరు. 2009లో హెలీకాఫ్టర్ ప్రమాదంలో ఆకస్మికంగా వైఎస్ చనిపోయారు. వైఎస్ మరణించి అప్పుడే ఎనిమిదేళ్లు కాలగర్భంలో కలిసిపోయినా ఆయన చేసిన సేవలు, ఆయన సంక్షేమ పథకాలు, ఆయన పరిపాలనను మాత్రం తెలుగు ప్రజలు అంత తొందరగా మర్చిపోలేరు. ఆయన పాలన అంతలా చెరగని ముద్రవేసింది తెలుగు ప్రజలపై. రాజకీయాల్లో వ్యక్తులపై ప్రత్యర్థులు ఆరోపణలు […]
టీడీపీలోకి జంప్ చేసే ఆ 30 మంది ఎమ్మెల్యేలు ఎవరు..?
ఏపీలో నంద్యాల ఉప ఎన్నిక ఎంత ప్రతిష్టాత్మకంగా జరిగిందో చూశాం. ఈ ఎన్నిక దాదాపు నెల రోజులు పాటు తెలుగు రాజకీయాలను బాగా హీటెక్కించేసింది. ఈ ఎన్నిక కోసం ఏపీ సీఎం చంద్రబాబు తన సచివాలయంలో ఉండాల్సిన మంత్రులతో పాటు మిగిలిన ఎమ్మెల్యేలందరిని అక్కడే మోహరించేశారు. తాను సైతం చివరి రెండు రోజులు నంద్యాలలో ప్రచారం చేశారు. ఇక విపక్ష వైసీపీ అధినేత వైఎస్.జగన్ అయితే తన పార్టీ ఎమ్మెల్యేలను అక్కడ మోహరించడంతో పాటు తాను ఏకంగా […]