ఏపీలోని ఏకైక విపక్షం జగన్ నేతృత్వంలోని వైకాపా.. ఎట్టిపరిస్థితిలోనూ 2019 ఎన్నికల్లో అధికారంలోకి రావాలని గట్టిగానే ప్రయత్నిస్తోంది. వాస్తవానికి 2014లోనే అత్యధిక మెజారిటీతో వైకాపా అధ్యక్షుడు జగన్ ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని అందరూ భావించారు. దీనికి అనుకూలంగానే అనేక విశ్లేషణలు, సర్వేలు కూడా వచ్చాయి. అయితే, అనూహ్యంగా చంద్రబాబు ఇచ్చిన డ్వాక్రా రుణమాఫీ, రైతురుణ మాఫీలు సైకిల్ సవారీ చేయడానికి, టీడీపీ అధికారంలోకి రావడానికి ఎంతగానో దోహదపడ్డాయి. అంతేకాదు, టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించి అటు బీజేపీతో […]
Tag: YS Jagan
జగన్ శత్రువు గెడ్డం దీక్షకు మోక్షం
వైకాపా అధినేత జగన్‌కు పొలిటికల్ రైవల్ కడప టీడీపీ యువ నేత శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి.. ఎట్టకేలకు తన గడ్డం దీక్షకు మోక్షం లభించడంతో ఆనందంతో ఊగిపోతున్నారు. తన దీక్ష ఫలించినందుకు పార్టీ చేసుకుంటున్నారు. ఇది తన ఒక్కడి విజయం కాదని, మొత్తంగా టీడీపీ విజయంగా ఆయన పేర్కొంటున్నారు. అదేసమయంలో వైఎస్ కు కంచుకోట వంటి పలివెందులలోనూ టీడీపీసైకిల్ రివ్వున సాగాలని, ఆదిశగా తాను మరిన్ని చర్యలు తీసుకుంటానని సతీష్ చెబుతున్నారు. ఈ […]
కడప గడపలో జగన్ పట్టు సడలుతోందిగా..
కడప జిల్లా అంటే వైసీపీకి పెట్టని కోట.. నిజానికి గత ఎన్నికలకు ముందు అక్కడ టీడీపీ సమర్థులకోసం కాగడా పెట్టి వెదికి మరీ ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చింది. అయినా అసెంబ్లీ ఫలితాలు మాత్రం జిల్లా వరకు వైసీపీకి అనుకూలంగా ఏకపక్షంగా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ జిల్లాపై వైఎస్ కుటుంబానికి ఉన్న పట్టు అలాంటిది మరి. కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకు అంతా రాయలసీమలో ప్రత్యేకించి కడప జిల్లాలో ప్రస్తుతం జగన్ వెంట నడుస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో […]
లైవ్‌షోలో కొమ్మినేనికి షాక్ ఇచ్చిన జగన్
వైకాపా అధినేత జగన్ గురించి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన పలువురు నేతలు చేసిన ప్రచారాన్ని బట్టి.. అగ్రెసివ్ అని, ఎవ్వరినీ పట్టించుకోడనీ, తనమాటే నెగ్గాలనే మొండి పట్టుదల గల వ్యక్తి అని అనుకుంటారు అందరూ. అదేవిధంగా తనలో ఫ్లెక్సిబిలిటీ ఉండదని, తన కింద పనిచేసే వారికి కొంచెమంటే కొంచెం కూడా రెస్పెక్ట్ ఇవ్వరని కర్రీలో కరేపాకులా తీసి పారేస్తూ ఉంటారని కూడా జగన్ గురించి వారు విపరీత ప్రచారం చేశారు. దీంతో అందరూ జగన్ […]
కెసిఆర్ కి సహకరించారు మరి జగన్ కి ?
గతంలో ఒకదశలో తెలంగాణ ఉద్యమం… నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దెబ్బకు కకావికలమైపోయిన దశలో… కేసీఆర్ ఉద్యమానికి సజీవంగా ఉంచేందుకు ఆలోచన కంటే ఆవేశం ఎక్కువగా ఉండే యువతను నమ్ముకున్నారు. తెలంగాణలోని కాలేజీలు, యూనివర్శిటీల్లో విద్యార్థులతో సమావేశాలు నిర్వహించి వారిలో విభజన ఉద్యమ జ్వాలలు రగిలించారు. వారితో పాటు ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాల సాయంతో ఉద్యమాన్ని మలి దశకు తీసుకెళ్లి అంతిమంగా లక్ష్యం సాధించగలిగారు. తాజగా జగన్ కూడా ప్రత్యేక హోదా అంశంపై చంద్రబాబు ప్రభుత్వంపై […]
జగన్ సవాల్‌కు బాబు స్పందిస్తాడా..!
ఎప్పటికప్పుడు అధికార టీడీపీ, సీఎం చంద్రబాబుపై ఓ రేంజ్‌లో ఫైరైపోతున్న వైకాపా అధినేత జగన్ తాజాగా మరో సవాలు విసిరారు. ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని.. జనం ఎవరి పక్షాన ఉన్నారో తేల్చుకుందామని అన్నారు. అంతటితో ఆగకుండా.. పోలీసులు, ధనం, బలం, బలగం అంతా మీదగ్గరే ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఆదివారం రాత్రి ప్రవాస ఆంధ్రులతో సాక్షి టీవీలో నిర్వహించిన లైవ్ షోలో జగన్ మాట్లాడారు. చంద్రబాబుకు నైతిక విలువలు లేవని, అవినీతిలో కూరుకుపోయాడని ధ్వజమెత్తారు. తన […]
చంద్రబాబు రూమ్‌లో ప్రత్యక్షం అయిన జగన్
ఎంతటి రాజకీయ వైరమున్నా ఎన్నికల సమయంలో మినహాయిస్తే మిగిలిన సందర్భాల్లో.. అధికార, ప్రతిపక్ష నేతలు పరోక్షంగానైనా కాస్తో కూస్తో మర్యాదపూర్వకమైన సంబంధాలను నెరుపుతారు. అయితే ఏపీలో మాత్రం ప్రస్తుతం ఆ పరిస్థితి ఏమాత్రం కనిపించడం లేదు. సమీప భవిష్యత్తులోనూ సాధ్యమవుతుందన్న నమ్మకమూ కలగడం లేదు. టీడీపీ ప్రభుత్వం పై అంశాలతో సంబంధం లేకుండా విభేదిస్తున్న జగన్…చంద్రబాబు విశ్వసనీయతను దెబ్బతీసేందుకు ప్రభుత్వ పాలనలోని ఏ చిన్న లోపాన్ని వదలకుండా విరుచుకుపడుతున్నారు. విపక్ష నేత జగన్ వచ్చే ఎన్నికల్లో అధికార […]
జగన్ పట్టువదలని విక్రమార్కుడు.
ప్రత్యేక హోదా రాదని కేంద్రం స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కూడా ప్యాకేజీతో సరిపెట్టుకున్నప్పటికీ, ప్రతిపక్షం వైఎస్‌ఆర్ కాంగ్రెసు పార్టీ మాత్రం ససేమిరా అంటోంది. ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేననే నినాదంతో ఆంధ్రప్రదేశ్ అంతటా వైఎస్ జగన్ పోరాటాన్ని ఉధృతం చేస్తున్నారు. ముందుగా యువతలో ప్రత్యేక హోదాపై చైతన్యం కలిగిస్తున్నారాయన. ఓ వైపు పార్టీ వేదికలపైనా, ఇంకో వైపు ప్రజల్లోకి వెళ్ళడం ద్వారా, ఇవి కాకుండా తన మీడియా సంస్థల ద్వారా సమాజంలోని అన్ని […]
పవన్ లడ్డూలు – జగన్ శెనిక్కాయలు బెల్లం
కేంద్రం రాష్ట్రానికిచ్చిన ప్యాకేజ్ ని రెండు పాచి పోయిన లడ్డులతో మొన్నామధ్య కాకినాడ సభలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విమర్శిస్తే తాజాగా వైసీపీ అధ్యక్షుడు వైస్ జగన్ కేంద్రం ఇస్తానంటున్న రాయితీలు శెనక్కాయలు బెల్లం తో సమానమని వ్యాఖ్యానించారు.రాయలసీమ ప్రాంతంలో శెనిక్కాయలు బెల్లం అనేది ఒక టైం పాస్ స్నాక్ ఐటెం లాంటిది.కేంద్రం ఇస్తానంటున్న పన్ను రాయితీలు కూడా అలాంటివేనని జగన్ చెప్పుకొచ్చారు. పవన్,జగన్ ఇద్దరి సభల అజెండా ఒకటే అయినా పవన్ ప్రశ్నించకపోగా ఇంకాస్త […]