ప్రియుడు కోరాడని ప్రేయసి ఏం చేసిందో తెలుసా?

ప్రేమించిన వారు కోరితో కొండ మీద కోతినైనా తెచ్చేందుకు వెనకాడరు. అలాంటిది తనకు ఎంతో ఇష్టమైన ప్రేమికుడు కోరాడని ఓ ప్రేయసి చేసిన పని గురించి తెలుసుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఆ అమ్మాయిని దూషించకమానరు. ఇంతకీ ఆ ప్రేమికుడు ఏం కోరాడు.. ఆ ప్రేయసి ఏం చేసిందో తెలియాలంటే వెస్ట్ బెంగాల్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే. వెస్ట్ బెంగాల్‌లోని నార్త్ 24 పర్గానాస్ జిల్లా బషీర్ హట్ సబ్ డివిజన్‌కు […]

కొంప ముంచిన మంచు.. ట్రక్కును ఢీకొని 18 మంది దుర్మరణం..!

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నదియా జిల్లాలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 18 మంది దుర్మరణం చెందారు. ప్రమాదంలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తర 24 పరగణాల జిల్లా బాగ్డా నుంచి 20 మంది వ్యక్తులు మెటాడోర్ వాహనంలో మృతదేహాలను తీసుకుని నవదీప్ శ్మశాన వాటిక వైపు బయలుదేరారు. వేగంగా వెళ్తున్న ఈ వాహనం నదియా జిల్లాలోని హన్సకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో ఫుల్బరి వద్ద రోడ్డు పక్కన ఆగి […]

దీదీ గూటికి 33 మంది బీజేపీ ఎమ్మెల్యేలు?!

ఇటీవ‌ల ముగిసిన ప‌శ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజయం సాధించి అధికారంలోకి రావాల‌ని బీజేపీ భావించిన‌ప్ప‌టికీ.. చివ‌ర‌కు అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీనే విజయకేతనం ఎగ‌ర‌వేసి హ్యాట్రిక్ కొట్టింది. 213 స్థానాల్లో టీఎంసీ విజయదుందుభి మోగించ‌గా.. బీజేపీ 77 స్థానాల‌తో స‌రిపెట్టుకుంది. అయితే టీఎంసీ గెలుపుతో.. బీజేపీ నేత‌లు ఎప్పుడెప్పుడు దీదీ గూటికి చేరిపోదామా అని క‌ల‌వ‌ర‌ప‌డుతున్నార‌ట‌. ఒక‌రు కాదు.. ఇద్ద‌రు కాదు.. 33 మంది బీజేపీ ఎమ్మెల్యేలు తిరిగి తృణమూల్‌లో చేరాల‌ని భావిస్తున్నార‌ట‌. బీజేపీ […]

బెంగాల్‌లో జేపీ న‌డ్డా శ‌ప‌థం.. ఏమిటంటే..?

ఇటీవ‌ల ప‌శ్చిమ‌బెంగాల్ ఎన్నిక‌ల్లో బీజేపీ ఘోర‌ప‌రాజ‌యాన్ని చ‌విచూసింది. అధికారంలోకి వ‌స్తామ‌ని ప్ర‌గ‌ల్భాలు ప‌లికిన కాషాయ‌ద‌ళం ఆశించిన స్థాయిలో సీట్ల‌ను సాధించ‌లేక‌పోయింది. టీఎంసీ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ చేతిలో ఘోర ప‌రాభ‌వాన్ని పొందింది. ఇదిలా ఉండ‌గా ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీ అనుస‌రించిన దాడులను ఎన్నిక‌ల అనంత‌రం టీఎంసీ నేత‌లు కొన‌సాగిస్తున్నారు. వ‌రుస‌గా బీజేపీ క్యాడ‌ర్‌పై దాడుల‌కు పూనుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ హ‌డావుడిగా బెంగాల్‌లో ప‌ర్య‌టించారు. మ‌మ‌తాబెన‌ర్జీ మూడోసారి ప్ర‌మాణ‌స్వీకారం చేసిన రోజునే ఆయ‌న […]

అక్క‌డ జోరు.. మ‌రోచోట క‌నుమ‌రుగు

కేర‌ళ‌లో సాంప్ర‌దాయానికి విరుద్ధంగా వ‌రుస‌గా రెండోసారి అధికారంలోకి రానుంది పిన‌ర‌యి విజ‌యన్ నేతృత్వంలోని లెఫ్ట్ డెమొక్ర‌టిక్ ఫ్రంట్‌. మొత్తం 140 స్థానాల‌కు గాను 90 స్థానాల్లో ఆధిక్య‌త‌ను క‌న‌బ‌రుస్తున్న‌ది. ఎర్ర‌జెండా రెప‌రెప‌లాడుతున్న‌ది. కానీ ప‌శ్చిమ బెంగాల్ లో వామ‌ప‌క్షాల ప‌రిస్థితి ద‌య‌నీయంగా మారిపోయింది. ఆ పార్టీ అక్క‌డ పూర్తిగా క‌నుమ‌ర‌గ‌య్యే అవ‌కాశం ఏర్ప‌డింది. వెస్ట్ బెంగాల్‌లో మొత్తం 294 స్థానాలు ఉండ‌గా అందులో 292స్థానాల‌కు ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించారు. అందులో తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా 202 స్థానాల్లో […]

బెంగాల్‌లో ఓవైసీ పార్టీకి ఝ‌ల‌క్‌..!

పశ్చిమ బెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్ విజ‌యం దిశ‌గా దూసుకుపోతున్న‌ది. బీజేపీ పోటీ ఇచ్చినా మెజార్టీ సాధించ‌లేక‌పోతున్న‌ది. మొత్తం 294 అసెంబ్లీ స్థానాల‌కు గాను 292 స్థానాల‌కు ఎనిమిది విడ‌త‌ల్లో ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించింది. ఈ రాష్ట్రంలో సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 184 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా బీజేపీ 98 సీట్లలో లీడింగ్ లో ఉంది. క్షణ క్షణానికీ లెక్కలు మారుతున్నాయి. ఇక నందిగ్రామ్ నియోజకవర్గంలో మొదట మమత ఆధిక్యంలో ఉన్నట్టు కనబడినా […]

ఓట‌మి దిశ‌గా కేంద్ర మంత్రి.. 200 ఆధిక్యంలో డిప్యూటీ సీఎం

ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగుతున్నాయి. మ‌హ‌మ‌హులు ఓట‌మి దిశ‌గా ప‌య‌నిస్తున్నారు. ఇప్ప‌టికే టీఎంసీ పార్టీ ప్ర‌భుత్వాన్ని చేప‌ట్టేందుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగ‌ర్‌ను దాటేసింది. మొత్తంగా 161 స్థానాల్లో ముందంజ‌లో ఉన్న‌ది. బీజేపీ 118 స్థానాల్లో ఆధిక్యంలో కొన‌సాగుతున్న‌ది. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు లెక్కించిన ఓట్ల‌లో మొత్తంగా టీఎంసీ 51శాతం సాధించ‌గా, 35శాతం ఓట్ల‌ను మాత్ర‌మే సాధించ‌డం గ‌మ‌నార్హం. ఇదిలా సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ పోటీ చేస్తున్న నందిగ్రామ్‌లో బీజేపీ అభ్య‌ర్థి సువేందు అధికారి దూసుకెళ్తున్నారు. మూడు […]

నందిగ్రామ్‌లో వెన‌క‌బ‌డిన మ‌మ‌త‌..!

దేశ‌వ్యాప్తంగా అంద‌రి చూపు ప్ర‌స్తుతం ప‌శ్చిమ‌బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల పైనే ఉన్నాయి. అక్క‌డ ఎన్నిక‌లు ఉత్కంఠ‌గా కొన‌సాగాయి. బీజేపీ, టీఎంసీ మధ్య నెక్ టు నెక్ ఫైట్ న‌డుస్తున్న‌ది. పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో ఇరు పార్టీల మ‌ధ్య స్వ‌ల్ప సంఖ్య‌లోనే తేడాలు ఉండ‌డంతో మ‌రింత ఉత్కంఠ‌త రేపుతున్న‌ది. మొత్తంగా 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా తీవ్ర కాక రేపుతున్నాయి. క్షణం క్షణం ఫలితాలు తారుమారు అవుతున్నాయి. ఆది నుంచి టీఎంసీ […]