ఓట‌మి దిశ‌గా కేంద్ర మంత్రి.. 200 ఆధిక్యంలో డిప్యూటీ సీఎం

May 2, 2021 at 10:42 am

ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగుతున్నాయి. మ‌హ‌మ‌హులు ఓట‌మి దిశ‌గా ప‌య‌నిస్తున్నారు. ఇప్ప‌టికే టీఎంసీ పార్టీ ప్ర‌భుత్వాన్ని చేప‌ట్టేందుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగ‌ర్‌ను దాటేసింది. మొత్తంగా 161 స్థానాల్లో ముందంజ‌లో ఉన్న‌ది. బీజేపీ 118 స్థానాల్లో ఆధిక్యంలో కొన‌సాగుతున్న‌ది. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు లెక్కించిన ఓట్ల‌లో మొత్తంగా టీఎంసీ 51శాతం సాధించ‌గా, 35శాతం ఓట్ల‌ను మాత్ర‌మే సాధించ‌డం గ‌మ‌నార్హం.

ఇదిలా సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ పోటీ చేస్తున్న నందిగ్రామ్‌లో బీజేపీ అభ్య‌ర్థి సువేందు అధికారి దూసుకెళ్తున్నారు. మూడు రౌండ్ల ఓట్ల లెక్కింపు ముగిసే స‌మయానికి సువేందు 8ఓట్ల ఆధిక్యంలో ఉండ‌టం గ‌మనార్హం. మ‌మ‌త ప‌రాజ‌యం ఖాయ‌మైపోయిన‌ట్లేన‌ని తెలుస్తున్న‌ది. ఇక‌ ప‌శ్చిమ‌బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల బ‌రిలో దిగిన కేంద్ర మంత్రి బుబుల్ సుప్రియో ఓట‌మి దిశ‌గా ప‌య‌నిస్తున్నారు. ఆయ‌న టోలిగంజ్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలో నిలిచారు. ఇదిలా ఉండ‌గా త‌మిళ‌నాడు డిప్యూటీ సీఎం ప‌ళ‌నిస్వామి కేవ‌లం 200 ఓట్ల ఆధిక్యంలో మాత్ర‌మే కొన‌సాగుతున్నారు.

ఓట‌మి దిశ‌గా కేంద్ర మంత్రి.. 200 ఆధిక్యంలో డిప్యూటీ సీఎం
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts