తెలంగాణ‌లో వైసీపీలోకి రివ‌ర్స్ జంపింగ్‌లు

ఏపీలో ప్ర‌తిప‌క్షంలో ఉన్న వైసీపీ.. తెలంగాణ‌లో మ‌నుగ‌డ సాధించ‌డానికి అవ‌స్థలు ప‌డుతోంది. ఆ పార్టీకి చెందిన నాయ‌కులంతా గులాబీ కండువా క‌ప్పేసుకోవ‌డంతో నాయ‌కులు ఎవ‌రైనా ఉన్నారో లేదో కూడా తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. అయితే ఇప్పుడు వైసీపీలో జోష్ నింపే ప‌రిణామం జ‌రిగింది. ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌తో పార్టీనుంచి వెళ్లిపోయిన నేత‌లు.. మ‌ళ్లీ సొంత‌గూటికి వ‌స్తున్నారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కూ స్త‌బ్ధుగా ఉన్న వైసీపీకి కొత్త ఉత్తేజం వ‌చ్చినట్ట‌యింది. ఇదే స‌మ‌యంలో టీఆర్ఎస్‌లో ఇమ‌డ‌లేక‌పోయిన వారు మ‌రికొంద‌రు బ‌య‌టికి వ‌స్తారేమో […]

తుమ్మ‌ల‌పై కేసీఆర్ కోపానికి అర్థాలే వేర‌యా..!

రైతుల మీద వ‌రాల జ‌ల్లులు కురిపిస్తుంటే.. వారంతా రోడ్డెక్కి నిర‌స‌న‌ల‌కు దిగారు! మ‌ద్దతు ప్ర‌క‌టించి అన్నీ ఉచితంగా ఇస్తామ‌ని స్వ‌యంగా సీఎం ప్ర‌క‌టిస్తే.. పంట‌ను మంటల్లో వేశారు!! తెలంగాణ‌లో రైతులంద‌రిపైనా సీఎం కేసీఆర్‌.. వ‌ద్దంటే వ‌రాలు కురిస్తున్నారు. కానీ ఆయ‌న‌కు స‌న్నిహితుడు, మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు ఇలాకా అయిన ఖ‌మ్మంలో.. మిర్చి రైతులు ప్ర‌భుత్వంపై ఆగ్ర‌హం వ్య‌క్తంచేయ‌డం.. స‌ర్కార్‌కు మింగుడు ప‌డ‌టం లేదు. దీంతో ఆ అసంతృప్తిని కేసీఆర్‌.. మ‌రోలా వ్య‌క్తంచేశారు. తుమ్మ‌ల ప్రాతినిధ్యం వ‌హిస్తున్న శాఖ‌పై […]

విప‌క్షాల‌కు చిక్కిన టీడీపీ, టీఆర్ఎస్‌ .. సెల్ఫ్ డిఫెన్స్‌లో పార్టీలు

ఇరు తెలుగు రాష్ట్రాల‌ అసెంబ్లీ స‌మావేశాల్లో  పూర్తి ఆధిప‌త్యం చెలాయిస్తున్న అధికార ప‌క్షాలు.. చివ‌ర‌కు విప‌క్షాల చేతికి చిక్కాయి! తెలంగాణ‌తో పోల్చితే ఏపీలో బ‌ల‌మైన విపక్షం ఉన్నా.. అందుకు దీటుగా టీడీపీ నేత‌లు స‌మాధానం చెబుతున్నారు. అలాగే తెలంగాణ‌లో.. గొంతు విప్పి.. విమర్శ చేసే వారిపై సస్పెన్షన్ వేటు వేసేందుకు ఏ మాత్రం వెనుకాడని తెలంగాణ ప్రభుత్వ పెద్దల పుణ్యమా అని.. సభలో హడావిడి చేయలేని పరిస్థితి. త‌మ అధికారంతో గొంతు నొక్కేసిన అధికార ప‌క్షాలు ఇప్పుడు […]

అసంతృప్తితో కాపులు ఆ పార్టీకి దూరం…దూరం

తెలంగాణ‌లో ఇప్పుడిప్పుడే బ‌లం పుంజుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్న కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ త‌గ‌ల‌బోతోంది. అన్ని వ‌ర్గాల‌ను కూడ‌దీసుకునేందుకు తీవ్రంగా శ్ర‌మిస్తున్న ఆ పార్టీకి.. బ‌ల‌మైన సామాజిక వ‌ర్గం షాక్ ఇవ్వ‌బోతోంది. పార్టీలో త‌మకు సరైన ప్రాధాన్యం ద‌క్క‌డం లేద‌ని, అన్యాయం జ‌రుగుతోంద‌ని కాపు సామాజిక వ‌ర్గ నేత‌లు తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోతున్నార‌ట‌. దీంతో ఇక కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి.. కారెక్కేందుకు సిద్ధ‌మ‌వుతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా ఇది కాంగ్రెస్‌కు శ‌రాఘాత‌మే అయ్యే అవ‌కాశాలున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్‌కు మొద‌టి నుంచి నిలుస్తున్న […]

మరో వ్యూహంతో టీఆర్ఎస్ బలాన్ని నిరూపించేందుకు సిద్ధమవుతున్న కెసిఆర్

కొడితే ఏనుగు కుంభ‌స్థ‌లాన్ని కొట్టాల‌ని తెలంగాణ సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌తిప‌క్షం బ‌లంగా ఉన్న న‌ల్గొండ‌ను టార్గెట్ చేసుకున్నారు. దీంతో కాంగ్రెస్‌ అధిష్టాన పెద్ద‌లంద‌రికీ ఒకేసారి స‌మాధానం చెప్పాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. అంతేగాక టీఆర్ఎస్ బ‌లాన్ని నిరూపించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన.. ఎంపీ గుత్తాసుఖేంద‌ర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వాల‌ని భావిస్తున్న త‌రుణంలో.. నల్లగొండ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వ‌హించి, ప్ర‌జల్లో టీఆర్ఎస్‌కు ప్ర‌జాద‌ర‌ణ ఉంద‌ని కాంగ్రెస్‌కు తెలిసొచ్చేలా చేసేందుకు వ్యూహాత్మ‌కంగా […]

తిరుమల వెంకన్నకు కేసీఆర్ కానుకలు ఇవే…

తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలోని మొక్కుల‌ను, ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఇచ్చిన హామీల‌ను ఒక్కొక్క‌టిగా తీర్చుకుంటూ వ‌స్తున్నారు సీఎం కె,చంద్ర‌శేఖ‌ర్ రావు!! ప్ర‌త్యేక రాష్ట్ర ఉద్యమం సందర్భంలో  తెలంగాణ సిద్ధించేందుకు ఎక్కని మెట్లు లేవు.. మొక్కని దేవుడు లేడ‌ని ఆయ‌న త‌ర‌చూ వ్యాఖ్యానిస్తూ ఉంటారు. ఇటీవ‌లే భ‌ద్రాక‌ళి అమ్మ‌వారికి కిరీటం, ఖ‌డ్గం; అలాగే కురివి మల్లన్నకు మీసాలు కూడా స‌మ‌ర్పించారు.  ఇప్పుడు తిరుమల శ్రీ‌నివాసుడి మొక్కు చెల్లిచేందుకు సిద్ధ‌మ‌య్యారు. దాదాపు రూ.6కోట్ల విలువైన ఆరణాల‌ను శ్రీ‌వారికి కానుక‌గా స‌మ‌ర్పించ‌బోతున్నారు. రెండు […]