సంతోష్‌-మెహ్రీన్‌ మూవీకి ఇంట్ర‌స్టింగ్ టైటిల్‌?!

పేపర్ బాయ్ సినిమాలతో హీరోగా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన సంతోష్ శోభ‌న్‌.. ఇటీవల ఏక్ మినీ కథ సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించి మంచి విజ‌యాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఇక ప్ర‌స్తుతం సంతోశ్‌ శోభన్‌, మెహ్రీన్‌ జంటగా ఓ సినిమా తెరకెక్కుతోంది. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ చిత్రం హైద‌రాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో సైలెంట్‌గా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. అయితే ఈ సినిమా టైటిల్‌కు సంబంధించిన ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త నెట్టింట వైర‌ల్‌గా […]

మ‌హేష్‌తో మ‌ళ్లీ న‌టించాల‌నుంది..ఓపెన్ అయిన ప్ర‌భాస్ భామ‌!

కృతి సనన్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మ‌హేష్ హీరోగా తెర‌కెక్కిన 1 – నేనొక్కడినే సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ బాలీవుడ్ భామ.. ఆ త‌ర్వాత దోచేయ్ సినిమాలో మెరిసింది. కానీ, ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ్డాయి. ఇక బాలీవుడ్‌లో వ‌రుస సినిమాతో దూసుకుపోతోన్న కృతి.. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ హీరోగా తెర‌కెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ఆదిపురుష్‌లో హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ భామ‌.. […]

జ‌గ‌ప‌తిబాబు ప‌రువు తీసిన బాబు గోగినేని..ఏం జ‌రిగిందంటే?

ఎప్పుడూ ఏదో ఒక విష‌యంపై ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడ‌టం బిగ్ బాస్ ఫేమ్, హేతువాది బాబు గోగినేనికి అల‌వాటే. ఎవ‌రో ఒక‌రిని టార్గెట్ చేస్తూ వార్త‌ల్లో నిల‌వక‌పోతే.. ఆయ‌నకు రోజు కూడా గ‌డ‌వ‌దు. ఇక తాజాగా సీనియ‌ర్ హీరో జ‌గ‌ప‌తిబాబుపై షాకింగ్ కామెంట్స్ చేస్తూ ప‌రువు తీశారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్లే.. కరోనా కష్టకాలంలో దొరకిన ఒక దివ్యాస్త్రం ఆనందయ్య మందు. దాదాపు ప్ర‌జ‌లంద‌రూ కూడా అదే న‌మ్మ‌కంగా ఆనంద‌య్య మందును వాడుతున్నారు. ఇక ఇటీవ‌ల జ‌గ‌ప‌తిబాబు […]

`నువ్వు నేను` హీరోయిన్ అనిత సంచ‌ల‌న నిర్ణ‌యం..ఇక‌పై అలా..?!

నువ్వు నేను సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన అనిత గురించి ప్ర‌త్యేకంగా పరిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఈ చిత్రం త‌ర్వాత తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ మ‌రియు హిందీ భాష‌ల్లోనూ న‌టించి గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతుందని అంతా అనుకుంటుండగానే అనూహ్యంగా సినిమాల్లో కనిపించడం మానేసి.. ప‌లు సీరియ‌ల్స్ ద్వారా బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైంది. ఈ క్ర‌మంలోనే 2013లో అనిత‌ రోహిత్ రెడ్డిని పెళ్లాడింది. ఇక ఈ మ‌ధ్యే పండంటి మ‌గ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. […]

శ్రీ‌కాంత్‌కు వార్నింగ్ ఇచ్చిన బాల‌య్య‌..కార‌ణం అదేన‌ట‌!

నంద‌మూరి బాల‌కృష్ణ ముక్కుసూటి త‌నం ఏపాటిదో మనం ఎన్నో సందర్భాల్లో చూసే ఉంటాము. ఏ విష‌యంలో అయినా, ఎవ‌రి విష‌యంలో అయినా బాల‌య్య స్ట్రైట్ ఫార్వ‌ర్డ్ గా ఉంటారు. ఇక ఇదిలా ఉంటే.. తాజాగా శ్రీకాంత్‌కు వార్నింగ్ ఇచ్చార‌ట బాల‌య్య‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా బాల‌య్యే తాజాగా ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపారు. ఇంత‌కీ శ్రీ‌కాంత్‌కు బాల‌య్య వార్నింగ్ ఇవ్వ‌డం ఏంటీ..? అస‌లు ఏం జ‌రిగింది..? అన్న సందేహాలు మీకు వ‌చ్చే ఉంటాయి. ఒకానొక సమయంలో హీరోగా […]

అప్పుడే పెళ్లి.. వైర‌ల్‌గా తాప్సీ కామెంట్స్!

ఝుమ్మందినాదం సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టిన తాప్సీ.. ఇక్క‌డ ప‌లు చిత్రాలు చేసిన త‌ర్వాత బాలీవుడ్‌కు మ‌కాం మార్చేసింది. అక్క‌డే వ‌రుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గ‌డుపుతున్న తాప్సీ.. ఎప్పుడెప్పుడు పెళ్లి పీట‌లెక్కుతుందా అని అభిమానులు ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. డెన్మార్క్‌కు చెందిన బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు మాథ్యూస్‌తో తాప్సీ ప్రేమాయ‌ణం న‌డిపిస్తుంద‌ని గ‌త కొద్ది రోజులుగా వార్తలు వ‌స్తూనే. అంతేకాదు వీరిద్దరూ త్వరలోనే పెళ్ళి చేసుకోబోతున్నట్టు బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా […]

ప్ర‌భాస్ బ‌డా ప్రాజెక్ట్‌లో ఆ టాలీవుడ్ భామ‌కు అదిరే ఆఫ‌ర్‌!?

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న బ‌డా ప్రాజెక్ట్స్‌లో నాగ్ అశ్విన్ చిత్రం ఒక‌టి. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయాంతీ మూవీస్‌ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించ‌నున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ కీల‌క‌ పాత్ర పోషించ‌నున్నాడు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త నెట్టింట వైర‌ల్ అవుతోంది. […]

ఆ హీరోయిన్‌ను కాపీ కొట్ట‌డం ఇష్ట‌మంటున్న స‌మంత‌!

టాలీవుడ్, కోలీవుడ్ భాష‌ల్లో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న స‌మంత అక్కినేని ఇటీవ‌లె ఫ్యామిలీ మ్యాన్ 2 అనే హిందీ వెబ్ సిరీస్‌తో డిజిట‌ల్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సిరీస్‌లో త‌న అద్భుత‌మైన న‌ట‌న‌తో స‌మంత‌.. ప్రేక్ష‌కులను మ‌రియు సినీ ప్ర‌ముఖుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంది. దీంతో ప్ర‌స్తుతం బీటౌన్‌లో స‌మంత పేరు మారుమోగిపోతోంది. ఇదిలా ఉంటే..తాజాగా ఓ బాలీవుడ్ వెబ్ సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స‌మంత ప్ర‌ముఖ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనేపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. […]

రిలీజ్‌కు ముందే ర‌వితేజ మూవీపై క‌న్నేసిన సల్మాన్..త్వ‌ర‌లోనే..?

మాస్ మ‌హారాజా ర‌వితేజ ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రం ఖిలాడీ. రమేశ్‌ వర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై జయంతి లాల్‌ గడ సమర్పణలో సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ డ్యూయ‌ర్ రోల్ చేస్తుండ‌గా.. మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అయితే ఖిలాడీ ఇంకా విడుద‌ల కాకుండానే.. ఈ సినిమాపై క‌న్నేశాడు బాలీవుడ్ కండ‌ల వీరుడు సల్మాన్ ఖాన్‌. ఇటీవ‌ల విడుద‌లైన ఖిలాడీ టీజ‌ర్‌కు స‌ల్మాన్ […]