ఈ సంక్రాంతికి శృతిహాసన్ నుంచి రెండు సినిమాలు రాబోతున్నాయి. అందులో మెగాస్టార్ చిరంజీవి నటించిన `వాల్తేరు వీరయ్య` ఒకటి కాగా.. నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన `వీర సింహారెడ్డి` మరొకటి. ఈ రెండు చిత్రాలను మైత్రీ మూవీ మేకర్స్ వారే నిర్మించారు. జనవరి 12న వీర సింహారెడ్డి విడుదల కాబోతుండంగా.. వాల్తేరు వీరయ్య జనవరి 13న ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తాజాగా శృతిహాసన్ సైతం ఓ […]
Tag: telugu movies
`వాల్తేరు వీరయ్య` బిజినెస్.. చిరు గత చిత్రాలతో పోలిస్తే చాలా తక్కువ!
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి `వాల్తేరు వీరయ్య` సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. బాబి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రను పోషించాడు. శృతిహాసన్, కేథరిన్ ఇందులో హీరోయిన్లుగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందించాడు. సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 13న ఈ చిత్రం విడుదల కాబోతోంది. […]
వెంకీతో `కేజీఎఫ్` భామ రొమాన్స్.. వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ తెలిస్తే నోరెళ్లబెడతారు!
కేజిఎఫ్ మూవీతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న కన్నడ సోయగం శ్రీనిధి శెట్టి.. ఇటీవల `కోబ్రా` మూవీ తో ప్రేక్షకులను పలకరించింది. విక్రమ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అయితే తాజాగా ఈ బ్యూటీ తెలుగులో ఓ ప్రాజెక్టుకు సైన్ చేసిందని అంటున్నారు. నారప్ప, దృశ్యం 2, ఎఫ్ 3 చిత్రాలతో వరుస విజయాలను అందుకున్న విక్టరీ వెంకటేష్ తన తాతపరి చిత్రాన్ని హిట్, హిట్-2 చిత్రాలతో మంచి పేరు […]
`నాటు నాటు` సాంగ్ కి గోల్డెన్ గ్లోబ్ అవార్డు.. చరిత్ర సృష్టించిన `ఆర్ఆర్ఆర్`!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ `ఆర్ఆర్ఆర్` గత ఏడాది విడుదలై ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఎన్నో రివార్డులు, అవార్డులు అందుకున్న ఆర్ఆర్ఆర్.. అంతర్జాతీయ సినిమా వేదికపై చరిత్ర సృష్టించింది. అమెరికాలోని కాలిఫోర్నియా బెవర్లీహిల్స్ వేదికగా 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రధానోత్సవం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ వేడుకలో ఆర్ఆర్ఆర్ చిత్రానికి గోల్డెన్ గ్లోబ్ వరించింది. […]
వైజాగ్ లో చిరంజీవి కొనుగోలు చేసిన స్థలం విలువ తెలిస్తే షాకే!
మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే `వాల్తేరు వీరయ్య` సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రను పోషించాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కాబోతోంది. అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల వైజాగ్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ.. వైజాగ్ నగరమంటే […]
`శాకుంతలం`లో సమంతనే ఎందుకు తీసుకున్నారో తెలుసా?
`యశోద` వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం సమంత నుంచి రాబోతున్న మరో భారీ చిత్రం `శాకుంతలం`. మహాభారతంలోని శకుంతల, దుష్యంతుల ప్రణయగాథ ఆధారంగా గుణశేఖర్ రూపొందించిన మైథలాజికల్ లవ్ స్టోరీ ఇది. దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ స్వరాలు అందించాడు. ఇందులో శకుంతలగా సమంత, దుష్యంత మహారాజు దేవ్ మోహన్ నటించారు. ఫిబ్రవరి 17న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో […]
రష్మికను బాలీవుడ్ నుంచి తరిమికొడతాం.. కేఆర్‌కే ఘాటు వ్యాఖ్యలు!
బాలీవుడ్ లో మూవీ క్రిటిక్‌గా చెప్పుకునే కమల్ ఆర్ ఖాన్(కేఆర్‌కే) తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నాను బాలీవుడ్ నుంచి తరిమికొడతాం అంటూ దారుణమైన కామెంట్లు చేశారు. మధ్యలో విజయ్ దేవరకొండను కూడా లాగుతూ సోషల్ మీడియా వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశాడు. `మేడమ్ రష్మిక జీ.. మా హిందీ ప్రేక్షకులు మీ బాయ్‌ఫ్రెండ్ అనకొండ సినిమా లైగర్‌ను రిజెక్ట్ చేసి అతన్ని బాలీవుడ్ నుంచి ఎలాగైతే తరిమికొట్టారో.. సరిగ్గా నీకు కూడా అలాగే చేయబోతున్నాం. కానీ […]
జాక్ పాట్ కొట్టిన తమన్నా.. వరుస ఫ్లాపుల్లోనూ మిల్కీ బ్యూటీ తగ్గట్లేదుగా!
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఈమె ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్లైపోయింది. ఇన్నేళ్లలో యాబైకి పైగా సినిమాల్లో నటించిన తమన్నా.. సరైన హిట్ అందుకుని చాలా కాలమే అయింది. ఇటీవల బబ్లీ బౌన్సర్, ప్లాన్ ఏ ప్లాన్ బీ, గుర్తుందా శీతాకాలం చిత్రాలు ప్రేక్షకులను మెప్పించడంలో పూర్తిగా విఫలం అయ్యాయి. వరుస ఫ్లాపుల నేపథ్యంలో తమన్నా కెరీర్ ఇక ముగిసినట్టే అని అందరూ భావించారు. కానీ, ఈ బ్యూటీకి ఆఫర్లు మాత్రం […]
పూజా హెగ్డే ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆ వార్తలన్నీ పుకార్లే అట!
టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే గత కొంతకాలం నుంచి వరుస ఫ్లాపులతో సతమతం అవుతన్న సంగతి తెలిసిందే. గత ఏడాది ఈ బ్యూటీకి ఒక్క హిట్టు కూడా లభించలేదు. పూజ హెగ్డే నటించిన ఆచార్య, బెస్ట్, రాధేశ్యామ్, సర్కస్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడ్డాయి. ఆమెను ఐరన్ లెగ్ అంటూ కూడా ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం పూజా హెగ్డే ఆశలన్నీ మహేష్ బాబు సినిమా పైన పెట్టుకుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ […]









