తిరువూరులో అదిరిపోయే ట్విస్ట్…మళ్ళీ కొత్త అభ్యర్ధి?

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అనే సామెత వినే ఉంటారు. అలాగే కార్యకర్తల బలం, బలమైన పునాదులు ఉన్నా సరే తిరువూరు నియోజకవర్గంలో టీడీపీ వరుసగా ఓడిపోతూనే వస్తుంది. 1983 నుంచి 1999 వరకు మంచి విజయాలే సాధించింది. ఆ తర్వాత నుంచి ఒక్కసారి కూడా పార్టీ గెలవలేదు. 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయింది. 2019 ఎన్నికల్లో అభ్యర్ధిని కూడా మార్చారు. నల్లగట్ల స్వామిదాస్‌ని మార్చి మాజీ మంత్రి కే‌ఎస్ జవహర్‌ని […]

ముందస్తుకు రెడీ..ఆ ఇంచార్జ్‌లకు షాక్?

టీడీపీ అధినేత చంద్రబాబు పదే పదే ముందస్తు ఎన్నికల గురించి ప్రస్తావిస్తూనే ఉన్నారు..గత రెండేళ్లుగా బాబు ముందస్తుకు వెళ్ళే అవకాశం ఉందని, దానికి టీడీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని చెబుతూనే ఉన్నారు. కానీ తాము నిర్ణీత కాలం వరకు అధికారంలో ఉంటామని, ఐదేళ్లు ఉంటామని వైసీపీ నేతలు చెబుతున్నారు. ముందస్తుకు వెళ్ళే ప్రసక్తి లేదని అంటున్నారు. కానీ బాబు మాత్రం జగన్ ముందస్తుకు వెళ్తారని బాగా కాన్ఫిడెన్స్‌తో ఉన్నట్లు కనిపిస్తున్నారు. తాజాగా కూడా ముందస్తు గురించి మరోసారి […]

విశాఖ ‘గర్జన’ వర్సెస్ ‘సేవ్’ ఉత్తరాంధ్ర..!

ప్రశాంతంగా ఉండే ఉత్తరాంధ్రలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. గత కొంతకాలంగా రాజధాని విషయంలో పెద్ద రచ్చ నడుస్తూనే ఉంది. ఎప్పుడైతే అమరావతి రైతులు…అమరావతి టూ అరసవెల్లి పాదయాత్ర మొదలుపెట్టారో అప్పటినుంచే ఉత్తరాంధ్రలోని వైసీపీ నేతలు..విశాఖని పరిపాలన రాజధాని అనే డిమాండ్‌తో ఉద్యమానికి సిద్ధమయ్యారు. అధికారంలో ఉన్నా, మూడేళ్ళ క్రితమే మూడు రాజధానులు ప్రకటించినా సరే..ఏదో ప్రతిపక్షంలో ఉన్నట్లుగా వైసీపీ నేతలు విశాఖ రాజధాని అని పోరాటం మొదలుపెట్టారు..అలాగే అమరావతి రైతుల పాదయాత్రని అడ్డుకుని తీరుతామని ప్రకటనలు చేస్తున్నారు. […]

రెడ్ జోన్‌లో టీడీపీ..ఆ స్థానాల్లో దారుణం!

వైసీపీపై వ్యతిరేకత పెరిగిపోయింది..అబ్బో అసలు జగన్ పాలన బాగోలేదు..ఎమ్మెల్యేలని ప్రజలు తరిమికొడుతున్నారు.. ఇంకేముంది నెక్స్ట్ ప్రజలు వైసీపీని పక్కన పెట్టి, టీడీపీని ఆదరించేస్తారు అనే ఓవర్ కాన్ఫిడెన్స్‌తో టీడీపీ నేతలు ఉన్నారు. అంటే నాయకులు పెద్దగా గ్రౌండ్ వర్క్ చేయకుండా , ప్రజల్లో తిరగకుండా, వైసీపీపై వ్యతిరేకత తమని గెలిపించేస్తుందనే ధీమాతో ఉన్నారు. ఈ ధీమానే టీడీపీకి అతి పెద్ద మైనస్ అవుతుందని పార్టీ అంతర్గత సర్వేల్లో తేలింది. ఇటీవల కాలంలో చంద్రబాబు నియోజకవర్గాల వారీగా నేతలతో […]

గన్నవరంలో ట్విస్ట్: వంశీ-వైసీపీ..యార్లగడ్డ-టీడీపీ?

గత ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గంలో ప్రత్యర్ధులుగా పోటీ చేసిన వల్లభనేని వంశీ-యార్లగడ్డ వెంకటరావు..మళ్ళీ ప్రత్యర్ధులుగా దిగబోతున్నారా?  అంటే అవుననే గన్నవరంలోని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అదేంటి యార్లగడ్డ వైసీపీలో ఉన్నారు..అటు టీడీపీ నుంచి గెలిచిన వంశీ కూడా వైసీపీ వైపుకు వచ్చారు కదా..మరి అలాంటప్పుడు ఇద్దరు నేతలు ప్రత్యర్ధులుగా ఎలా పోటీ చేస్తారని డౌట్ రావొచ్చు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అది చెప్పుకునే ముందు ఒకసారి గత ఎన్నికల గురించి మాట్లాడుకుంటే..గత ఎన్నికల్లో వంశీ […]

వైసీపీ మైండ్‌గేమ్‌తో టీడీపీ చిత్తు..!

ఉన్నది లేనట్లుగా…లేనిది ఉన్నట్లుగా..నిజాన్ని అబద్దంగా.. అబద్దాన్ని నిజంగా మార్చడమే రాజకీయం. ఒకప్పుడు ప్రజల్లో తిరిగి వారి మెప్పు పొంది నేతలు ఓట్లు పొందేవారు. కానీ ఇప్పుడు మైండ్ గేమ్‌లు ఆడి ఓట్లు పొందుతున్నారు. ఈ మైండ్ గేమ్ ఆడటంలో వైసీపీ బాగా ఆరితేరిపోయింది. వైసీపీ ఆడే గేమ్‌లో పడి టీడీపీ చిత్తు అవుతూనే ఉంది. అయితే ఇటీవల వైసీపీ మరో మైండ్‌గేమ్‌కు తెరలేపింది. ఈ గేమ్‌లో కూడా టీడీపీ చిత్తు అయ్యేలా ఉంది. రాజధాని విషయంలో వైసీపీ […]

సాయిరెడ్డి చానల్..కాన్ఫిడెన్స్ లేదే..?

ఎప్పుడు సొంత కథనాలు ఇవ్వని ఈనాడు సంస్థ సైతం ఈ మధ్య..తమదైన శైలిలో వైసీపీపై విరుచుకుపడుతుంది. పదే పదే వైసీపీ నేతలు..ఈనాడు, రామోజీరావులపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. దుష్టచతుష్టయం అంటూ మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే ఈనాడు సైతం తమ పంథాని మార్చుకుంది. ఇప్పటివరకు నాయకులు మాట్లాడిన మాటలని మాత్రమే తమ పత్రికలో గాని, మీడియాలో గాని వేసేది. ఇప్పుడు మాత్రం సొంత కథనాలు ఇస్తూ వస్తుంది..ఇప్పటికే రాజధాని అంశంలో వైసీపీ వైఫల్యాలని ఎండగట్టింది. అలాగే […]

నగరి గ్రౌండ్ రిపోర్ట్: ప్లస్-మైనస్‌లు ఇవే..?

గత రెండు ఎన్నికలుగా టీడీపీ కసిగా చెక్ పెట్టాలని అనుకుంటున్న వారిలో రోజా కూడా ఒకరు. ఫైర్ బ్రాండ్ నాయకురాలుగా ఉన్న రోజా టీడీపీని వదిలి..వైసీపీ వైపుకు వెళ్ళాక ఏ స్థాయిలో చంద్రబాబుని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారో చెప్పాల్సిన పని లేదు. ఇక ఇలా దూకుడుగా ఉన్న రోజాకు చెక్ పెట్టాలని టీడీపీ ప్రయత్నిస్తూ..దగ్గరకొచ్చి మరే బోల్తా కొడుతుంది. 2014 ఎన్నికల్లో నగరి నుంచి రోజా టీడీపీపై కేవలం 858 ఓట్లతో మాత్రమే గెలిచారు. అంటే రోజాకు […]

కొడాలి వర్సెస్ కమ్మ..గుడివాడలో అదే డేర్..!

ఏపీ రాజకీయాల్లో కొడాలి నాని అంటే ఫుల్ ఫైర్ బ్రాండ్ నాయకుడు..ఇంకా చెప్పాలంటే చంద్రబాబు, లోకేష్‌లని బూతులు తిట్టే ఏకైక నాయకుడు. తమ అధినేత జగన్‌ని విమర్శిస్తే..ఎవరిని వదిలిపెట్టననేది కొడాలి పాలసీ. ఇక ఈ మూడేళ్లలో కొడాలి ఏ స్థాయిలో చంద్రబాబుని తిట్టారో..అలాగే భువనేశ్వరి గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేశారో అందరికీ తెలిసిందే. ఇలా తనదైన శైలిలో మాటల తూటాలు వదిలే కొడాలిది కమ్మ వర్గమే..అటు తిటించుకునే చంద్రబాబుది కమ్మ వర్గమే అనే సంగతి తెలిసిందే. ఇలా […]