కడప జిల్లాలోని బద్వేలులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ అసెంబ్లీ ఉపపోరులో టీడీపీ నుంచి పోటీ లో ఉండే అభ్యర్ధిని నారా చంద్రబాబునాయుడు నిర్ణయించారు. ఆ ప్రాంతానికి చెందిన ఓబుళాపురం రాజశేఖర్ ను పోటీ చేయించాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. రాజశేఖర్ గత 2019 ఎన్నికల్లోనూ పోటీచేశారు. కానీ ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. బద్వేలు నియోజకవర్గ ఎస్సీ కేటగిరికి చెందినది. అయితే బద్వేలులో వైసీపీ నుంచి డాక్టర్ జీ. వెంకటసుబ్బయ్య పోటీ చేశారు. టీడీపీ నుంచి […]
Tag: TDP
పాపం చంద్రబాబు.. ఎన్నెన్ని కష్టాలు వచ్చాయో..?
‘అధికారాంతమునందు చూడవలె కదా.. ఆ అయ్య సౌభాగ్యముల్’ అన్నారు పెద్దలు. అధికారం ఉన్నప్పుడు అందరూ మన చుట్టూ తిరుగుతూ మన భజన చేస్తూ కీర్తిస్తూ గడుపుతూ ఉంటారు. కానీ, అధికారం దిగిపోయిన తర్వాత సంగతి ఏమిటి? అధికారం లేకపోయినా కూడా ఎవరికి విలువ దక్కుతుందో వారు మాత్రమే నిజమైన నాయకులు అనుకోవాలి. ఇప్పుడు చంద్రబాబునాయుడు అధికారంలో లేరు. దానికి తగ్గట్టుగానే పార్టీలో కూడా ఆయన ప్రభ పలచబడిపోయింది. పట్టించుకునే వారు తక్కువ. ఖాతరు చేసే వారు, భయపడేవారు […]
మల్లన్నను రామన్న సమర్థిస్తున్నట్లుందే..!
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి వాడిన పదజాలాన్ని మంత్రి, టీ కేటీఆర్ సమర్థిస్తున్నారా అని ప్రశ్నిస్తే అవుననే చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు. మంత్రి కేటీఆర్ గురువారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మల్లారెడ్డిని నేరుగా సమర్థించకుండా దాదాపు సమర్థిస్తున్నట్లే మాట్లాడారు. రెండు రోజుల క్రితం మంత్రి మల్లారెడ్డి తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో రేవంత్ రెడ్డిని పరుష పదజాలంతో దూషించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన […]
’ఓటుకు నోటు‘ కేసు.. రేవంత్ కు కోర్టు సమన్లు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూ కేసీఆర్ కు నిద్రలేకుండా చేస్తున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి శనివారం నాంపల్లి కోర్టు సమన్లు పంపింది. అక్టోబర్ 4న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. రేవంత్ తోపాటు ఎమ్మెల్యే సండ్ర వెంటక వీరయ్య, సెబాస్టియన్, ఉదయ్ సింహ, మత్తయ్య జెరూసలేం, వేంక్రిష్ణ కీర్తన్ లకు సమన్లు పంపింది. రేవంత్ రెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీలోఉన్నపుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రలోభాలకు గురిచేశారని కేసు నమోదైంది. ఈడీ నమోదు చేసిన ఈకేసు […]
వచ్చే ఎన్నికల్లో టీడీపీదే అధికారం అంటున్న సర్వే..!
2019 లో ఆంధ్రప్రదేశ్లో చాలా రసవత్తరంగా ఎన్నికలు జరిగాయి. అక్కడ వైఎస్ఆర్సిపి 151 స్థానాల్లో ఘనవిజయం సాధించింది. దీనికి జగన్ మీద నమ్మకంతోనే, ఆయన చెప్పినట్టు వంటి పథకాలు, ప్రజలను ఆకర్షించడంతో ప్రజలు జగన్ కి అక్కడ పట్టం కట్టారు.ఇక ఇప్పుడు అదే ప్రజలకు శాపంగా మారినట్టు తెలుస్తోంది. జగన్ పాలన పై ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారట. అయితే ఇప్పుడు తెలిపిన తాజా సర్వే ప్రకారం ఇటీవల ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషనల్ […]
టీడీపీకి బిగ్ షాక్..పార్టీకి గోరంట్ల బుచ్చయ్య గుడ్‌బై?!
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు దేశం పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి అనంతరం టీడీపీ ముఖ్యనేతలంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. తాజా సమాచారం ప్రకారం.. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు గురువారం నాడు బుచ్చయ్య చౌదరి పార్టీ అధినేత చంద్రబాబుకు లేఖ రాసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. పార్టీ నాయకత్వ పనితీరుపై తీవ్ర అసంతృప్తి ఉన్నారని, ఆ […]
నారా లోకేష్ అరెస్ట్.. రమ్య కుటుంబానికి మద్దతుగా నిలిచిన టీడీపీ..
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరులో బీటెక్ అమ్మాయి రమ్య ఓ ఉన్మాది చేతిలో స్వాతంత్ర్య దినోత్సవం రోజే దారుణ హత్యకు గురి కావడం బాధాకరం. ఈ ఉదంతంలో రమ్య కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితుడికి కఠిన శిక్ష విధించాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా విద్యార్థిని కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం చెల్లించి, నిందితుడిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. అయితే తెలుగుదేశం […]
ఎక్కడున్నారో? ఏం చేస్తున్నారో?
వైజాగ్ స్టీల్ ప్లాంట్(వీఎస్పీ) ప్రైవేటీకరణ అవుతుందో, లేదో పక్కన పెడితే ప్రైవేటు విషయం కేంద్రం ప్రకటించినప్పటి నుంచీ ఏపీలో ఈ విషయం చర్చనీయాంశమైంది. రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని తీసుకొని ప్రజల్లో సానుభూతిని సంపాదించాలని భావిస్తున్నాయి. అందుకే నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. అయితే అందరికంటే ఓ అడుగు ముందుకేసిన వైజాగ్ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాత్రం ఏకంగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. వీఎస్పీ పరిరక్షణకు మద్దతుగా రాజీనామా చేసినా ఆ తరువాత స్పీకర్ […]
శభాష్..RRR(సొంత పార్టీ వాళ్లతో కాదులెండి)
వైసీపీ ఎంపీ రఘురామక్రిష్ణం రాజు అందరిచేతా శభాష్ అనిపించుకుంటున్నారు. సొంత పార్టీ వాళ్లతో కాదులెండి.. పార్లమెంటు సభ్యులతో.. ఎందుకంటే ఈయనే పార్లమెంటు సమావేశాలకు గైర్హాజరు కాకుండా సమావేశాల్లో పాల్గొంటున్నారు. సమావేశాల్లో ఈయన హాజరు 96 శాతం ఉంది. హాజరు కావడం మాత్రమే కాదు.. ప్రశ్నలు అడగడంలోనూ.. చర్చల్లో పాల్గొనడంలోనూ ఈయనే ముందున్నారు. ప్రజాప్రయోజనం కింద జరిగిన 50 చర్చల్లో పాల్గొనడంతోపాటు 145 ప్రశ్నలు వేసి సమాధానం రాబట్టారు. RRR తరువాత తెలుగుదేశం పార్టీ ముగ్గరు ఎంపీలు యాక్టివ్ […]