’ఓటుకు నోటు‘ కేసు.. రేవంత్ కు కోర్టు సమన్లు

August 29, 2021 at 7:57 am

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూ కేసీఆర్ కు నిద్రలేకుండా చేస్తున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి శనివారం నాంపల్లి కోర్టు సమన్లు పంపింది. అక్టోబర్ 4న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. రేవంత్ తోపాటు ఎమ్మెల్యే సండ్ర వెంటక వీరయ్య, సెబాస్టియన్, ఉదయ్ సింహ, మత్తయ్య జెరూసలేం, వేంక్రిష్ణ కీర్తన్ లకు సమన్లు పంపింది.

రేవంత్ రెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీలోఉన్నపుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రలోభాలకు గురిచేశారని కేసు నమోదైంది. ఈడీ నమోదు చేసిన ఈకేసు కోర్టులో కొద్ది సంవత్సరాలుగా విచారణలో ఉంది. ఇది అవినీతి కేసు కాదని, ఏసీబీ పరిధిలోకి రాదని రేవంత్ తదితరులు సుప్రీం తలుపులు తట్టడంతో కేసును ఏసీబీనుంచి తప్పించారు. ఆ తరువాత రేవంత్, సండ్రలు వేర్వేరుగా కోర్టును ఆశ్రయించి కేసులో తమ పేరును తొలగించాలని అభ్యర్థించారు. ఈ నేపథ్యంలోనే నాంపల్లి కోర్టు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి సమన్లు పంపింది. మరి రేవంత్, ఇతరులు కోర్టుకు హాజరవుతారో, లేక మినహాయింపు కోరుతూ పిటిషన్ దాఖలు చేస్తారో వేచి చూడాలి.

’ఓటుకు నోటు‘ కేసు.. రేవంత్ కు కోర్టు సమన్లు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts