ప్ర‌ముఖ‌ టాలీవుడ్ హీరోయిన్ ఇంట్లో తీవ్ర విషాదం..!

ప్ర‌ముఖ టాలీవుడ్ హీరోయిన్ నందిత శ్వేత ఇంట్లో తీవ్ర విషాదం నెల‌కొంది. తాను ఎంత‌గానో ప్రేమించే తండ్రిని నందిత కోల్పోయింది. నిన్న (సెప్టెంబర్ 19) నందిత తండ్రి శివ స్వామి (54) కన్నుమూశారు. దాంతో ఆమె కుటుంబం మొత్తం శోక‌సంద్రంలో మునిగిపోయింది. ఇక తన తండ్రిని కోల్పోయిన విషయాన్ని స్వయంగా వెల్లడించిన నందిత.. `నా తండ్రి శ్రీ శివ స్వామి 54 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.` అని ట్వీట్ పెట్టింది. […]