హాట్‌స్టార్‌తో `మాస్ట్రో` డీల్ పూర్తి..విడుద‌ల ఎప్పుడంటే?

యంగ్ హీరో నితిన్‌, ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ మేర్లపాక గాంధీ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం మాస్ట్రో. బాలీవుడ్‌లో హిట్ అయిన అంధాధూన్ కి ఇది రీమేక్‌. క్రైమ్‌ కామెడీ థ్రిల్ల‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో న‌భా న‌టేష్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. త‌మ‌న్నా నెగ‌టివ్ రోల్ పోషించింది. ఈ మ‌ధ్యే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అయితే ఈ చిత్రం థియేట‌ర్‌లో కాకుండా.. ఓటీటీలో విడుద‌ల కానుంది. ఈ సినిమా ఓటీటీ డీల్ […]

ర‌వితేజ డేరింగ్ స్టెప్‌..దుబాయ్‌కి `ఖిలాడి` టీమ్‌?!

టాలీవుడ్ మాస్ మ‌హారాజా ర‌వితేజ తాజా చిత్రం ఖిలాడి. రమేశ్‌ వర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంలో డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ బ్యానర్ల‌పై సత్యనారాయణ కోనేరు, రమేష్ వర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే క‌రోనా సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకుప‌డ‌టంతో.. శ‌ర‌వేగంగా జ‌రుగుతున్న ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ ప‌డింది. ఇక ప్ర‌స్తుతం అన్నీ చిత్రాలు సెట్స్ మీద‌కు వెళ్తుండ‌డంతో.. ఖిలాడీ […]

`అఖండ‌`లో చిరు భామ‌ స్పెష‌ల్ సాంగ్‌?!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో ముచ్చ‌ట‌గా మూడోసారి తెర‌కెక్కుతున్న తాజా చిత్రం అఖండ‌. ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌ రెడ్డి ఈ చిత్రంలో ప్రగ్య జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా, సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ విల‌న్‌గా న‌టిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించ‌బోతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇండ్ర‌స్టింగ్ వార్త ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇంత‌కీ మ్యాట‌ర్ ఏంటంటే.. మెగాస్టార్ చిరంజీవి […]

ధ‌నుష్ జోరు..మ‌రో తెలుగు డైరెక్ట‌ర్‌కు గ్రీన్‌సిగ్నెల్‌?!

కోలీవుడ్ స్టార్ హీరో ధునుష్ త్వ‌ర‌లోనే తెలుగుతో ఓ స్ట్రైట్ మూవీ చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నాడు. నారాయణ దాస్ నారంగ్ – రామ్మోహన్ రావ్ ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో భారీ బ‌డ్జెట్‌తో సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమిళనాడు రాజకీయాలతో ముడిపడిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా ఉండ‌బోతోంద‌ని తెలుస్తోంది. అయితే ప్ర‌స్తుతం శేఖర్ కమ్ముల పూర్తి స్థాయి స్క్రిప్ట్ ను […]

మ‌ళ్లీ భ‌య‌పెట్టేందుకు సిద్ధ‌మైన వ‌ర్మ‌..రంగ‌లోకి బిగ్‌బి!

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు, కాంట్రవర్సీ కేరాఫ్ రామ్ గోపాల్ వ‌ర్మ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఒకప్పుడు తన సినిమాలతో బాక్సాఫీస్ రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టిన‌ ఈయన ఇపుడు వివాస్ప‌ద సినిమాలతో వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ప్ర‌స్తుతం చిన్నా చిత‌క సినిమాలు చేస్తున్న వ‌ర్మ‌.. త్వ‌ర‌లోనే బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ తో సినిమా చేయ‌బోతున్నాడ‌ట‌. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వ‌ర్మ ఈ విష‌యాన్ని స్వ‌యంగా తిలిపాడు. అంతేకాదు, వ‌ర్మ ఫెవ‌రేట్ స‌బ్జెట్ అయిన […]

మొద‌లైన ప్ర‌శాంత్ వ‌ర్మ `హ‌నుమాన్`..మ‌ళ్లీ ఆ హీరోతోనే!

అ!, కల్కి, జాంబీరెడ్డి వంటి విభిన్న‌మైన చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌కు చేర‌వైన టాలీవుడ్ యంగ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ‌.. త‌న నాల్గొవ చిత్రాన్ని హ‌నుమాన్‌గా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. పురాణ ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా నేడు పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభం అయింది. అయితే ఈ చిత్రంలో హీరో ఎవ‌ర‌న్న‌ది ప్ర‌శాంత్ వర్మ ప్ర‌క‌టించ‌క‌పోయినా.. యువ హీరో తేజ సజ్జనే అంటూ జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. ఇప్పుడు ఆ ప్ర‌చార‌మే నిజ‌మైంది కూడా. అవును, తేజ స‌జ్జా […]

బాలీవుడ్‌కు అల్ల‌రి న‌రేష్ `నాంది`..హీరో ఎవ‌రో తెలుసా?

అల్ల‌రి న‌రేష్ హీరోగా విజయ్ కనకమేడల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం నాంది. ఎస్వీ2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లో సతీష్ వేగేశ్న నిర్మించిన ఈ సినిమాలో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ కీల‌క పాత్ర పోషించింది. తీర్పు కోసం ఎదురుచూస్తున్న అండర్ ట్రయల్ ఖైదీ జీవిత నేపథ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో విడుద‌లైన ఈ చిత్రం ఘ‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో రీమేక్ చేసేందుకు ప్ర‌ముఖ నిర్మాత దిల్ […]

ప్ర‌భాస్ `ఆదిపురుష్‌`లో హ‌నుమంతుడు అత‌డేన‌ట‌?!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న భారీ ప్రాజెక్ట్స్‌లో ఆదిపురుష్ ఒక‌టి. రామాయణం నేపథ్యంలో బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్ర‌భాస్ రాముడుగా క‌నిపించ‌నుండ‌గా.. కృతి స‌న‌న్ సీత‌గా, బాలీవుడ్ హీరో సన్నీ సింగ్‌ లక్ష్మణుడిగా, సైఫ్ అలీ ఖాన్ రావ‌ణుడిగా న‌టిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో హ‌నుమంతుడు పాత్ర ఎవ‌రు చేస్తున్నార‌న్న‌ది ఇప్ప‌టి వ‌ర‌కు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించ‌లేదు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. హనుమంతుడి పాత్రలో మరాఠీ […]

`శ్యామ్ సింగరాయ్` ఫైనల్ షెడ్యూల్ షురూ!

న్యాచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో శ్యామ్ సింగ‌రాయ్ ఒక‌టి. రాహుల్‌ సాంకృత్యన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో సాయి ప‌ల్ల‌వి, కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తోంది. పిరియాడికల్ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్నారు. అయితే కరోనా కారణంగా ఆగిపోయిన ఈ చిత్ర ఫైనల్ షెడ్యూల్ తాజాగా మొదలైంది. ఈ విషయాన్ని మేకర్స్ వెల్లడించారు. ఇప్పటికే ఫ్లాష్ బ్యాక్ సీన్స్ మొత్తం పూర్తి చేయగా, […]