మ‌ళ్లీ భ‌య‌పెట్టేందుకు సిద్ధ‌మైన వ‌ర్మ‌..రంగ‌లోకి బిగ్‌బి!

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు, కాంట్రవర్సీ కేరాఫ్ రామ్ గోపాల్ వ‌ర్మ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఒకప్పుడు తన సినిమాలతో బాక్సాఫీస్ రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టిన‌ ఈయన ఇపుడు వివాస్ప‌ద సినిమాలతో వార్తల్లో నిలుస్తున్నారు.

అయితే ప్ర‌స్తుతం చిన్నా చిత‌క సినిమాలు చేస్తున్న వ‌ర్మ‌.. త్వ‌ర‌లోనే బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ తో సినిమా చేయ‌బోతున్నాడ‌ట‌. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వ‌ర్మ ఈ విష‌యాన్ని స్వ‌యంగా తిలిపాడు.

అంతేకాదు, వ‌ర్మ ఫెవ‌రేట్ స‌బ్జెట్ అయిన హ‌ర్ర‌ర్ నేప‌థ్యంలో ఈ సినిమాను తెర‌కెక్కించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. కానీ, ఈ చిత్రాన్ని హిందీలో మాత్రమే తీయ‌నున్న‌ట్లు వ‌ర్మ స్ప‌ష్టం చేశారు. ఏదేమైన‌ప్ప‌టికీ.. ఈ సారి బ‌డా హీరోతో ప్రేక్ష‌కుల‌ను భ‌య‌పెట్టేందుకు సిద్ధ‌మ‌య్యాడు వ‌ర్మ‌.