`అఖండ‌`లో చిరు భామ‌ స్పెష‌ల్ సాంగ్‌?!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో ముచ్చ‌ట‌గా మూడోసారి తెర‌కెక్కుతున్న తాజా చిత్రం అఖండ‌. ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌ రెడ్డి ఈ చిత్రంలో ప్రగ్య జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా, సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ విల‌న్‌గా న‌టిస్తున్నారు.

అలాగే ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించ‌బోతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇండ్ర‌స్టింగ్ వార్త ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇంత‌కీ మ్యాట‌ర్ ఏంటంటే.. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో రత్తాలు.. పాటతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేసిన రాయ్ లక్ష్మీ ఇప్పుడు బాల‌య్య‌తో చిందులేయ‌బోతోంద‌ట‌.

Lakshmi Rai movies: How Lakshmi Rai lost 15 kgs in 2 months to become a  biker chick | Malayalam Movie News - Times of India

అఖండ సినిమా కోసం తమన్ ఒక మసాలా సాంగ్ ను అందించాడట. ఈ పాట కోసం రాయ్ లక్ష్మిని తీసుకున్నట్టుగా చెప్పుకుంటున్నారు. అంతేకాదు, తదుపరి షెడ్యూల్లో బాలకృష్ణ – రాయ్ లక్ష్మిల‌పై ఆ స్పెషల్ షాంగ్ చిత్రిక‌రించ‌నున్నార‌ని తెలుస్తోంది.

Share post:

Latest