`రాధేశ్యామ్‌`పై న్యూ అప్డేట్ ఇచ్చిన పూజా హెగ్డే!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, పూజా హెగ్డే జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం రాధేశ్యామ్‌. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌, టీ-సిరీస్ సంయుక్తంగా భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కిస్తున్నారు. పిరియాడికల్‌ ప్రేమకథ నేప‌థ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం జూలై 30న విడుద‌ల కావాల్సి ఉంది. కానీ, క‌రోనా కార‌ణంగా ఈ మూవీ షూటింగ్‌కు బ్రేకులు ప‌డ్డాయి. అయితే ప్రస్తుతం క‌రోనా పరిస్థితులు చ‌క్క‌డ‌బుతుండ‌డంతో.. మ‌ళ్లీ ఈ మూవీ […]

దేశంలో కొత్త‌గా 39,097 క‌రోనా కేసులు..పెరిగిన మ‌ర‌ణాలు!

ఎక్క‌డో చైనాలో పుట్టిన అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే క‌రోనా ఉధృతి త‌గ్గుతూ వ‌స్తోంది. గ‌త కొద్ది రోజులుగా భార‌త్‌లోనూ క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. అయితే నిన్న క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు స్వ‌ల్పంగా పెరిగాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 39,097 మందికి కొత్తగా కరోనా సోకింది. […]

నేడు ప్ర‌భాస్ కొత్త చిత్రం ప్రారంభం..రంగంలోకి బిగ్‌బీ!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, నాగ్ అశ్విన్ కాంబోలో ఓ భారీ బ‌డ్జెట్ చిత్రం తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ దీపికా ప‌డుకోణె హీరోయిన్‌గా.. బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బ‌చ్చ‌న్ కీలక పాత్రతో క‌నిపించ‌నున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక పాన్ వ‌ర‌ల్డ్ లెవ‌ల్‌లో తెర‌కెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ రోజు హైద‌రాబాద్ లో పూజా కార్య‌క్ర‌మాల‌తో ఈ మూవీని స్టార్ట్ […]

మ‌రో హిట్ మూవీతో అల‌రించ‌బోతోన్న `ఆహా`!

ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా విభిన్న‌మైన వెబ్ సిరీస్‌లు, కొత్త కొత్త సినిమాలు, ఆక‌ట్టుకునే టాక్ షోల‌తో పాటుగా.. ఇత‌ర భాష‌ల్లో హిట్ అయిన చిత్రాల‌ను కూడా డ‌బ్ చేసిన విడుద‌ల చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగానే మ‌రో హిట్ మూవీతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు సిద్ధ‌మైంది ఆహా. పూర్తి వివార‌ల్లోకి వెళ్లే..మలాయళ స్టార్ మమ్ముట్టి నటించిన తాజా చిత్రం వ‌న్‌. ఈ ఏడాది మార్చిలో థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ చిత్రం సూప‌ర్ హిట్‌గా నిలిచింది. […]

పెళ్లైనా త‌గ్గని కాజ‌ల్‌..అవి చూపిస్తూ హాట్ పోజులు!

టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్.. ఇటీవ‌లె ప్రియుడు, ముంబైలో స్థిర‌ప‌డిన వ్యాపార‌వేత్త గౌత‌మ్ కిచ్లూను పెళ్లాడి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. పెళ్లి త‌ర్వాత కూడా వ‌రుస సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌తో దూసుకుపోతున్న ఈ బ్యూటీ.. అందాల ఆర‌బోత‌లోనూ ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. ఎప్ప‌టిక‌ప్ప‌డు చిట్టి పొట్టి దుస్తులు ధ‌రించి.. హాట్ హాట్ ఫొటో షూట్లు నిర్వ‌హిస్తోంది. ఇక తాజాగా కూడా బ్లూ వింటేజ్‌ డ్రెస్ ధ‌రించి.. థైస్ అందాలు చూపిస్తూ హాట్ పోజులు […]

పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన `అఖిల్‌` భామ‌!

`అఖిల్` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో ప‌రిచ‌యం అయిన స‌యేషా సైగ‌ల్‌.. త‌మిళ న‌టుడు ఆర్య‌ను పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. 2019లో వీరి వివాహం అంగ‌రంగ‌వైభవంగా జ‌రిగింది. అయితే తాజాగా స‌యేషా సండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆర్య బెస్ట్ ఫ్రెండ్‌, ప్ర‌ముఖ హీరో విశాల్ సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశాడు. త‌ను మావ‌య్య అయ్యాన‌ని, చాలా ఎమోష‌న‌ల్‌గా ఉంద‌ని చెబుతూ విశాల్ ఆర్య‌, స‌యేషాల‌కు అభినంద‌న‌లు తెలిపారు. అలాగే త‌న స్నేహితుడు ఆర్య తండ్రిగా […]

ప్ర‌ముఖ డైరెక్ట‌ర్‌ను పెళ్లాడ‌బోతున్న త్రిష‌..త్వ‌ర‌లోనే..?

`నీ మనసు నాకు తెలుసు` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన త్రిష్‌.. ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగింది. ఇక తెలుగులోనే కాకుండా త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం మ‌రియు హిందీ భాష‌ల్లోనూ న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే.. త్రిష్ పెళ్లి విష‌యం మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది. గ‌తంలో వరుణ్‌ మణియన్‌ అనే వ్యాపారవేత్తతో ప్రేమలో పడిన త్రిష.. అతడితో నిశ్చితార్థం చేసుకుంది. కానీ, ప‌లు కార‌ణాల వ‌ల్ల వీరి […]

ప్ర‌భాస్ న‌యా రికార్డ్‌..ఉబ్బిత‌బ్బిపోతున్న ఫ్యాన్స్‌!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌యా రికార్డ్ క్రియేట్ చేశారు. ఆసియా ఖండంలో నంబర్‌వన్‌ అందగాడిగా మ‌న డార్లింగ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. అవును, ఫ్యాన్సీ ఆడ్స్‌ అనే సంస్థ నిర్వహించిన టాప్‌ టెన్‌ మోస్ట్‌ హ్యాండ్సమ్‌ ఏసియన్‌ మెన్ సర్వేలో ప్ర‌భాస్ ఫ‌స్ట్ ప్లేస్‌ను ద‌క్కించుకున్నాడు. సౌత్‌ కొరియన్‌ స్టార్‌ కిమ్‌ హ్యూన్‌ జూంగ్‌, పాకిస్తాన్‌ నటులు ఇమ్రాన్‌ అబ్బాస్‌, ఫవాద్‌ ఖాన్‌ తదితరులను వెన‌క్కి నెట్టి ప్ర‌భాస్ మొద‌టి స్థానాన్ని ద‌క్కించుకోవ‌డంతో.. ఆయ‌న ఫ్యాన్స్ ఆనందంతో ఉబ్బిత‌బ్బిపోతున్నారు. […]

ఆ హీరోయిన్ సిరీస్‌పై మ‌న‌సు పారేసుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ!

ప్ర‌స్తుతం డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్‌తో లైగ‌ర్ సినిమా చేస్తున్న టాలీవుడ్ రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఓ వెబ్‌సిరీస్‌పై మ‌న‌సు పారేసుకున్నారు. ఇంత‌కీ ఆ సిరీస్ ఏదో కాదు..కుడి ఎడ‌మైతే. అమలాపాల్, రాహుల్ విజయ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను పవన్‌ కుమార్ తెర‌కెక్కించాడు. టైమ్‌ లూప్‌ కాన్సెప్ట్‌తో రూపుదిద్దుకున్న ఈ సిరీస్ ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ఆహాలో విడుద‌లై విశేస ఆద‌రన పొందింది. అయితే తాజాగా ఈ […]