రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో ఓ భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ దీపికా పడుకోణె హీరోయిన్‌గా.. బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రతో కనిపించనున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇక పాన్ వరల్డ్ లెవల్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ రోజు హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో ఈ మూవీని స్టార్ట్ చేయనున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే అమితాబ్ స్పెషల్ ఫ్లైట్‌లో హైదరాబాద్‌కు చేరుకున్నారు.
మొదట బిగ్‌బీపై కొన్ని కీలక సన్నివేశాలను నాగ్ అశ్విన్ చిత్రీకరించనున్నారట. అందుకోసం ఆరు రోజుల పాటు హైదరాబాద్‌లోనే ఉండి.. షూట్‌లో పాల్గొంటాని తెలుస్తోంది. ఇక త్వరలోనే ప్రభాస్ మరియు దీపికా కూడాఈ సెట్ లో అడుగు పెట్టబోతున్నారని తెలుస్తోంది.