బిగ్‌బాస్ 5: ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవ‌రంటే?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 5లో ప‌దో వారం ప్రారంభం అయింది. ఇప్ప‌టికే హౌస్ నుంచి స‌ర‌యు, ఉమా దేవి, ల‌హ‌రి, న‌ట్రాజ్ మాస్ట‌ర్‌, హ‌మీద‌, శ్వేతా వ‌ర్మ‌, ప్రియ‌, లోబో, విశ్వ‌లు ఎలిమినేట్ కాగా.. ఇంకా ప‌ది మందే హౌస్‌లో మిగిలి ఉన్నారు. వీరిలో ప‌దో వారం అనేక ప‌రిణామాల అనంత‌రం మానస్, సిరి, సన్నీ, యాంక‌ర్ రవి, కాజల్‌లు నామినేట్ అయ్యారు. అయితే ఈ ఐదుగురిలో ఎవ‌రు ఎనిమినేట్ అవుతార‌న్న‌ది ఇప్పుడు […]

గోల్డెన్ ఛాన్స్ ద‌క్కించుకున్న స‌మంత‌..ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్‌!

టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత ఈ మ‌ధ్యే భ‌ర్త నాగ‌చైత‌న్య‌తో విడిపోయి అక్కినేని కుటుంబంతో తెగ‌దెంపులు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం కెరీర్‌పై ఫుల్ ఫోక‌స్ పెట్టి వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్న సామ్‌.. తాజాగా ఓ గోల్డెన్ ఛాన్స్‌ను ద‌క్కించుకుంది. గోవాలో జరిగే ‘ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా’(ఐఎఫ్‌ఎఫ్‌ఐ) కార్యక్రమానికి పాల్గొనేందుకు సమంతకు ఆహ్వానం అందింది. అవును, ఈ 52వ ఇఫీ ఫెస్టివల్‌లో సమంతని స్పీకర్‌గా పాల్గొనాల్సి ఉందని ఇన్వైట్ చేసింది. దీంతో ఇఫీ ఈవెంట్‌లో […]

సమంత బాటలోనే ప్రముఖ హీరోయిన్ …?

ఆర్ట్స్, పెయిటింగ్ ల గురించి చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు.మనం చెప్పాలనుకుంటున్న భావాలను ఒక చిత్ర రూపంలో గీసి మనసుకు ప్రశాంతతను ఇచ్చే వాటిలో పెయింటింగ్స్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి అనే చెప్పాలి..పెయింటింగ్స్ కు బాధను పోగెట్టే శక్తి కూడా ఉంటుంది అని ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ సమంత ఒకసారి చెప్పుకొచ్చింది. కరోనా వల్ల ఎంతో మంది ఎన్నో రకాలుగా బాధలు అనుభవించారని, చాలామంది అయితే వారి జీవితం పట్ల ఆశలను కూడా వదిలేసుకున్నారు అని […]

ఏపీలో కొత్త‌గా 246 క‌రోనా కేసులు..మ‌ర‌ణాలెన్నంటే?

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా అదుపులోకి వ‌చ్చింది. గ‌త కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు 500 లోపుగానే న‌మోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 246 పాజిటివ్ […]

పేరు మార్చుకున్న ఎలన్ మస్క్ .. ఎందుకంటే..?

ప్రపంచ అపేర కుబేరుడు తన యూజర్లకు అనుకోని షాక్ ఇచ్చి ఆశ్చర్యంలో ముంచెత్తాడు.తన అధికారిక ట్విట్టర్‌లో ఎలన్‌మస్క్‌ తన డిస్‌ప్లే పేరును మార్చుకున్నాడు. ఎలన్‌మస్క్‌ గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ కంపెనీల యజమాని ఎలన్‌మస్క్‌. అయితే ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ సంస్థ అయిన టెస్లాలో ఎలన్‌మస్క్‌కి 17 కోట్లకు పైగానే షేర్లు ఉన్నాయి. కొన్ని ఇబ్బందుల కారణంగా రెండు రోజుల క్రితమే కొన్ని షేర్లను అమ్మేయాలని భావిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. […]

బాల‌య్య టాక్ షోలో సెకెండ్ గెస్ట్ ఎవ‌రో తెలుసా?

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ తొలిసారి హోస్ట్‌గా చేస్తున్న షో `అన్ స్టాప‌బుల్`. ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో ఈ షో ప్ర‌సారం అవుతోంది. ఇప్ప‌టికే ఫ‌స్ట్ ఎపిసోడ్ కూడా పూర్తి అవ్వ‌డ‌గా.. మొట్టమొద‌ట‌ క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు, మంచు ల‌క్ష్మి, మంచు విష్ణులు స్పెష‌ల్‌గా గెస్ట్‌లుగా విచ్చేశారు. దీపావ‌ళి కానుక‌గా న‌వంబ‌ర్ 4న ప్ర‌సార‌మైన ఈ ఎపిసోడ్ దాదాపు అంద‌రినీ ఆక‌ట్టుకుంది. ఈ నేప‌థ్యంలోనే సెకెండ్ ఎపిసోడ్ గెస్ట్ ఎవ‌రు..? బాల‌య్య ఎవ‌రిని ఇంట‌ర్వ్యూ […]

`అఖండ` టైటిల్‌ సాంగ్ వ‌చ్చేసింది..ఎలా ఉందంటే?

నంద‌మూరి బాల‌కృష్ణ, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో ముచ్చ‌ట‌గా మూడోసారి తెర‌కెక్కుతున్న చిత్రం `అఖండ‌`. ప్రగ్యాజైస్వాల్‌, పూర్ణ హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ మూవీలో సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు. ఇటీవ‌లె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలోనే జోరుగా ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హిస్తున్న చిత్ర యూనిట్.. తాజాగా అఖండ టైటిల్ సాంగ్‌ను విడుద‌ల చేసింది. ‘భం…అఖండ’ అనే లిరిక్స్‌తో సాగిపోయే ఈ సాంగ్ అంద‌రికీ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. […]

వామ్మో..పునీత్‌ స్మారకం వ‌ద్ద‌కు రోజూ అంత మంది వ‌స్తున్నారా?

క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అక్టోబ‌ర్ 29న తీవ్ర‌మైన గుండెపోటుతో హ‌ఠాన్మ‌ర‌ణం చెందిన చెందిన సంగ‌తి తెలిసిందే. బెంగళూరులోని కంఠీరవ స్టుడియోలో పునీత్ రాజ్‌కుమార్ భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే అక్టోబరు 31న అంత్యక్రియలు జరిగినప్పటి నుంచీ పునీత్ స్మారకం వ‌ద్ద‌కు ప్ర‌తి రోజు సగటున 30,000 మంది వ‌స్తున్నార‌ట‌. అంతేకాదు, ఇప్ప‌టి వ‌ర‌కు కర్ణాటక, పొరుగు రాష్ట్రాల్లోని దాదాపు 25 లక్షల మంది అభిమానులు ఆయ‌న‌కు నివాళులర్పించి కన్నీటి వీడ్కోలు పలికార‌ని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లోని […]

మాధురీ దీక్షిత్ త‌న‌యుడు దాతృత్వం..వెల్లువెత్తుతున్న ప్ర‌శంస‌లు!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మాధురి దీక్షిత్ త‌న‌యుడు ర్యాన్ చిన్న వ‌య‌సులోనే క్యాన్సర్ పేషెంట్ల ప‌ట్ల దాతృత్వం చాటుకుని ప్ర‌శంస‌లు అందుకుంటున్నాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మాధురి దీక్షిత్ సోష‌ల్ మీడియా ద్వారా ఓ వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఆమె త‌న‌యుడు ర్యాన్ త‌న లాంగ్ హెయిర్‌ను కటింగ్ చేయించుకుంటూ కనిపించాడు. అంతేకాదు, క‌త్తిరించిన త‌న జుట్టు మొత్తాన్ని కీమో థెరపీ చేయించుకుంటున్న పేషెంట్ల కోసం ఇచ్చేశాడు. ఈ విష‌యాన్నే మాధురీ దీక్షిత్ స్వ‌యంగా […]