సమంత బాటలోనే ప్రముఖ హీరోయిన్ …?

November 8, 2021 at 5:06 pm

ఆర్ట్స్, పెయిటింగ్ ల గురించి చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు.మనం చెప్పాలనుకుంటున్న భావాలను ఒక చిత్ర రూపంలో గీసి మనసుకు ప్రశాంతతను ఇచ్చే వాటిలో పెయింటింగ్స్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి అనే చెప్పాలి..పెయింటింగ్స్ కు బాధను పోగెట్టే శక్తి కూడా ఉంటుంది అని ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ సమంత ఒకసారి చెప్పుకొచ్చింది. కరోనా వల్ల ఎంతో మంది ఎన్నో రకాలుగా బాధలు అనుభవించారని, చాలామంది అయితే వారి జీవితం పట్ల ఆశలను కూడా వదిలేసుకున్నారు అని అలాంటి వారిలో మళ్లీ ఆత్మ స్థైర్యాన్ని నింపేందుకు ఇలా పెయింటింగ్, ఆర్ట్ వంటి ప్రోగ్రాంను ప్రారంభించారంటూ సమంత చెప్పుకొచ్చింది.

శ్రిష్టి ఆర్ట్ సంస్థ నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమంలో మనోహర్ చిలువేరు ముందుండి మరి నడిపిస్తున్నారు. అలాగే ఈ ఈవెంట్‌కు లక్ష్మీ నంబియార్ పలువురు సెలెబ్రిటీలను సైతం తీసుకెళ్లున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే సమంత ఆ ఈవెంట్‌కు వెళ్లి తనకు నచ్చినట్టుగా, వచ్చినట్టుగా పిచ్చి పిచ్చిగా పెయింటింగ్ వేసింది.ఆ తరువాత మంచు లక్ష్మీ సైతం తన కూతురు విద్యతో కలిసి ఈ ఈవెంట్ కి వెళ్లి ఫుల్ ఎంజాయ్ చేసింది.వీరి బాటలోనే ఇప్పుడు మరొక హీరోయిన్ అయిన  రెజీనా కసాండ్ర కూడా నడుస్తుంది.రెజీనా ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాల విషయంలో చాలా యాక్టీవ్ గ ఉంటుందన్న విషయం అందరికి తెలిసిందే.

ఈ ఆర్ట్స్, పెయింటింగ్ ఈవెంట్ కు విచ్చేసిన రెజీనా ఇలా చెప్పుకొచ్చింది.. ఆర్ట్‌కు మనిషి బాధలను పోగొట్టే శక్తి ఉంటే, ఆర్ట్ ను వేసే ఆర్టిస్ట్ లకు బాధలను పోగొట్టే నిపుణులు అవుతారు అంటూ చెప్పుకొచ్చింది. ఈ ఈవెంట్ ను ముందుండి నడిపిస్తున్న మనోహర్ చిలువేరు ఈ ఈవెంట్‌ను చాలా బాగా విజయవంతం చేసారు.అలాగే శ్రిష్టి ఆర్ట్ ఇలా ఏర్పాటు చేసినందుకు లక్ష్మీ నంబియార్‌కు థ్యాంక్స్ చెప్పింది. అలాగే రెజీనాను ఇక్కడకు తీసుకొచ్చినందుకు ఆలపాటి దీప్తికి కూదా కృతజ్ఞతలు తెలియచేసింది రెజీనా. !

సమంత బాటలోనే ప్రముఖ హీరోయిన్ …?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts