కేటీఆర్‌కు క‌విత షాక్ ఇస్తుందా ఏంటి

పాలిటిక్స్ అన్నాక ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఎవ‌రూ చెప్ప‌లేరు. ఇప్పుడు ఓడ‌లు అనుకున్న‌వి తెల్లారేస‌రికి బ‌ళ్లుగా మారిపోవ‌డం పాలిటిక్స్‌లోనే సాధ్యం. ఇప్పుడీ స్టోరీ అంతా ఎందుక‌నుకుంటున్నారా? అక్క‌డికే వ‌ద్దాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవ‌డం స‌హా దాని అభివృద్దికి ప‌గ‌లు రాత్రి అనే తేడా లేకుండా క‌ష్ట‌ప‌డుతున్న కేటీఆర్ భ‌విత‌వ్యం త్వ‌ర‌లోనే మారిపోతుంద‌ట! అంటే ఆయ‌న ఏ సీఎం అయిపోతార‌ని కాదు. ఆయ‌న పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ ఇప్పుడున్న‌దానిక‌న్నా ఏమీ బెట‌ర్ పొజిష‌న్‌కి వెళ్ల‌ద‌ట‌. అదేంటి అనుకుంటున్నారు. వాస్త‌వానికి ఇప్ప‌టి […]

ఆర‌డుగుల బుల్లెట్ అంటున్న కవిత

క‌విత.. ఈ పేరు వింటే కాస్తో కూస్తో క‌న్‌ఫ్యూజ‌న్ ఉండొచ్చేమో కాని తెలంగాణ‌ జాగృతి క‌విత అంటే మాత్రం తెలియ‌నివారు దాదాపు ఉండ‌ర‌నే చెప్పాలి. జాగృతి సంస్థ ద్వారా…తెలంగాణ సంస్కృతికి దాదాపు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా మారిపోయిందీ తెలంగాణ సీఎం గారాల‌ప‌ట్టి. తెలంగాణ ప్ర‌జ‌ల్లో సెంటిమెంట్‌ను ర‌గిలిస్తూ.. రాజ‌కీయాల‌ను పండించ‌డంలో తండ్రికంటే రెండాకులు ఎక్కువే చదివిందీమె. మాట‌ల మ‌రాఠీగా పేరుప‌డ్డ తండ్రితో స‌మానంగా మాట‌ల తూటాల‌ను విస‌ర‌గ‌ల‌న‌ని ఇప్ప‌టికే నిరూపించుకుంది కూడా… తెలంగాణ సీఎం కేసీఆర్ కు త‌న […]

కవిత కౌంటర్ అదిరింది

నిజామాబాద్ ఎంపీ,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారి కుమార్తె కవిత ఈ మధ్య రాష్ట్ర రాజకీయాల్లో అంతా చురుగ్గా పాల్గొనడం లేదన్నది వాస్తవం.హస్తిన రాజకీయాలతోనే కవిత బిజీ బిజీ గా గడుపుతోంది.ఎప్పుడో అడపా దడపా తెలంగాణా జాగృతి తరపున ఇక్కడ కనిపిస్తోందంతే. దీనికి కారణం లేకపోలేదు.రాష్ట్రంలో తన తండ్రి ఏకఛత్రాధిపత్యం చెలాయిస్తున్నారు.ప్రతిపక్షం అనేదే లేకుండా నిర్వీర్యం చేసేసారు.ఏదయినా చిన్న చితకా ఇబ్బందులుంటే అన్న కేటీర్,బావ హరీష్ రావు లు చక్కదిద్దేస్తున్నారు.ప్రభుత్వం పై వ్యతిరేకత బాగా ఎక్కువయినా..ప్రతి పక్షాలకు […]

కవిత కూడా ఏపీ వైపే

ఇంతలో ఎంత మార్పు..రాజకీయం అంటే ఇదే నేమో..రెండేళ్ల క్రితం వరకు ఛీ..తూ అన్నవారే ఇప్పుడు బాసటగా నిలుస్తున్నారు..తెలంగాణాలో ఆంధ్ర విద్యా సంస్థల్ని నిషేదిస్తాం..తెలంగాణలో ఆంధ్ర హోటళ్లు నడవనివ్వం..ఇంకా మాట్లాడితే ఆంధ్రోళ్ళను తరిమి కొడతాం అన్న తెరాస నాయకులే ఇప్పుడు హైదరాబాద్ లో ఆంధ్ర సెట్ట్లెర్స్ కి రెడ్ కార్పెట్ పరుస్తాం..ఆంధ్రోళ్ల కాళ్ళో ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తాం అనే స్థాయికి వచ్చేసారు.అదే మరి రాజకీయం అంటే. ఇక అసలు విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా […]

కేసీఆర్‌ కూడా ‘జై ఆంధ్రా’ అంటారేమో 

తెలంగాణకు జై కొట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి జై కొట్టడం తప్పేమీ లేదు. ఎందుకంటే, అందరం భారతదేశంలో ఉన్నాం. పరిపాలనా సౌలభ్యం కోసమే రాష్ట్రాలు, అందులో జిల్లాలు, వాటిల్లో మండలాలు, గ్రామాలు తప్ప, దేశమంతా ఒక్కటే. ఓ ప్రాంతంపై విమర్శలు చేయడం, ఇంకో ప్రాంతానికి అనుకూలంగా నినాదాలు చేయడం అంత శుభపరిణామం కాదు . దేశంలో ఎవరైనా ఎక్కడైనా స్వేచ్ఛగా జీవించవచ్చు. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య సున్నితమైన భావోద్వేగాలున్నాయి. ఉద్యమ వేడిలో సీమాంధ్రులపై కొంత విద్వేషం రగిలినమాట వాస్తవం.ఇప్పుడంతా […]